Share News

ఎందుకున్నట్టు.. ఏం చేస్తున్నట్టు?

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:43 AM

ఎందుకున్నట్టు.. ఏం చేస్తున్నట్టు?

ఎందుకున్నట్టు..  ఏం చేస్తున్నట్టు?

ఉత్సవ విగ్రహాల్లా ఏఎంసీలు

కానరాని రైతు అనుబంధ సేవలు

స్థానిక సంస్థలకు కేటాయింపులు లేవు

అడ్రస్‌లేని పశువైద్య శిబిరాలు

వచ్చిన ఆదాయం నేరుగా ఖజానాకే

దయనీయంగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు

పెద్దాపురం, మార్చి7 : వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు పూర్తిగా ఉత్సవ విగ్రహాల్లా మారిపోయాయి. ఏర్పాటు చేసిన లక్ష్యం మరిచాయి. రైతులకు కనీస స్థాయిలో సేవలు అంద జేయడం లేదు. గత నాలుగేళ్లుగా దయనీయంగా కొనసాగు తున్నాయి. ప్రతి ఏటా కోట్లలో ఆదాయం ఉంటున్నా రైతు అనుబంధ సేవలేవీ అందిన దాఖలాలు కనిపించడం లేదు. పశువైద్య శిబిరాలకుగానీ, స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల కుగానీ ఒక్క రూపాయి కేటాయింపులు లేవు. కాకినాడ

జిల్లా వ్యాప్తంగా ఉన్న 9 మార్కెట్‌ కమిటీల్లో ఈ పరిస్థితే కనిపి స్తోంది. వ్యవసాయ రంగాల సేవలకు సంబంధించి ప్రస్తా విస్తే మౌనమే అధికారుల నుంచి వచ్చే సమాధానంగా ఉం టోంది. సాధారణంగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు చెక్‌ పోస్టులు, గోదాముల నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తుల రవా ణా సమయంలో సెస్‌ వసూళ్ల ద్వారా ఆదాయం సమకూరు తోంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుకు సమయంలో అత్య ధిక ఆదాయం సమకూరుతోంది. గోదాముల అద్దెల రూపేణా ఆదాయం వస్తోంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఏఎంసీలను ఆదాయ వనరులుగా చూస్తున్నారే తప్ప గత ప్రభుత్వాలు అందించిన సేవలనూ కొనసాగించలేదు. వస్తున్న ఆదాయం కాస్తా నేరుగా రాష్ట్ర ఖజానాకు వెళ్లిపోతోందని పలువురు రైతులే విమర్శిస్తున్నారు. స్థానిక సంస్థల వాటాలనూ చెల్లించడం లేదని తెలుస్తోంది. అటు రైతులకు సంబంధించి పశువైద్య శిబిరా లు, సీజన్ల వారీగా పశువులకు టీకాలు మందులు వేయడం లేదు. జిల్లాకు సంబంధించి 69 రహదారి పనులకు సంబంధించి రూ.37 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నా ఇప్పటికీ ఒక్క పని కూడా పూర్తయినట్టు లేదు. దీంతో పొలాలకు వెళ్లే రహదారి మార్గాలు పూర్తి అధ్వానంగా మారిపోయాయి. దీం తో పంటల రవాణా సమయంలో రైతుల పాట్లు అన్నీఇన్నీ కావు.

కేటాయింపులేవీ..

సాధారణంగా నియోజకవర్గానికి ఒకటి లేదా రెండు ఏఎంసీ కార్యాలయాలుంటాయి. ఆయా ఏఎంసీలు పరిధిలో

ఉండే మండ లాలకు ఆదాయంలో కొంతభాగం కేటాయించాలి. వెనుకబడిన గ్రామాలు, పూర్తి వ్యవసాయాధారిత పంచాయతీలకు ఏఎంసీ వాటా నిధులు కేటాయించాలి. గతంలో గ్రామాల్లో సీసీ రహదారు లు, కాలువలు, ఇతరత్రా మౌలిక వసతుల కోసం ఈ నిధులు కేటా యించేవారు. స్థానిక సంస్థల ప్రతినిధులు సైతం ఈ నిధుల కోసం ఎంతగానో ఎదురుచూసేవారు. నేడు ఏఎంసీల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వెళ్లిపోతుండగా తిరిగి పైసా రావడం లేదు. ఆర్థిక సం ఘం సాధారణ నిధులను సైతం ప్రభుత్వం దారి మళ్లిస్తోంది.. ఏ ఎంసీ నిధులు ఒక లెక్కా అన్న ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది.

Updated Date - Mar 08 , 2024 | 01:43 AM