Share News

స్వాగతం పలుకుతున్న ‘చెత్త’ వాహనాలు

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:48 AM

నగర పంచాయితీ కార్యాలయం ఎదుట చెత్తను తొలగించే వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నా రు....సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనర్లు కూడా ప్రైవేటు వ్యక్తులు ఇక్కడే పార్కింగ్‌ చేస్తున్నారు.... కార్యా లయానికి వచ్చే ప్రజాప్రనిధులకు, ప్రజలకు ఇది ఇబ్బందికరంగా వాటిని చూడటానికి అసహ్యంగా ఉంది.

స్వాగతం పలుకుతున్న ‘చెత్త’  వాహనాలు

ముమ్మిడివరం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): నగర పంచాయితీ కార్యాలయం ఎదుట చెత్తను తొలగించే వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నా రు....సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనర్లు కూడా ప్రైవేటు వ్యక్తులు ఇక్కడే పార్కింగ్‌ చేస్తున్నారు.... కార్యా లయానికి వచ్చే ప్రజాప్రనిధులకు, ప్రజలకు ఇది ఇబ్బందికరంగా వాటిని చూడటానికి అసహ్యంగా ఉంది. 24 గంటల్లో వాటని అక్కడ నుంచి తొల గించాలని నగర పంచాయితీ చైర్మన్‌ కమిడి ప్రవీణ్‌కుమార్‌ శానిటరి ఇన్‌స్పెక్టర్‌ను ఆదే శించినా వాటిపై చర్యలు శూన్యం. ఇది జరిగి నేటికి 24రోజులు అయింది. అయితే వాటిని ఇంకా అక్కడే పార్కింగ్‌ చేస్తున్నారు. గత నెల 24న జరిగిన నగర పంచాయితీ కౌన్సిల్‌ సమా వేశంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కు సంబంధించి చెత్తను తొలగించేందుకు నగర పంచాయతీకి సమకూ ర్చిన వాహనాలు, ప్రైవేటు వ్యక్తులకు చెందిన సెప్టిక్‌ క్లీనర్లను నగర పంచాయతీ ఆవరణ నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను చైర్మన్‌ ఆదేశించగా కౌన్సి లర్లు కూడా వాటిని అక్కడ నుంచి తొలగించి చైర్మన్‌ ఆదేశాలను గౌరవించాలని నాటి సమావే శంలో అధికారులకు సూచించారు. వార్డుల్లో చెత్తను తొలగించేందుకు ముమ్మిడివరం నగర పంచాయతీకి సంబంధించి ఏడు వార్డు సచివాల యాలకు ఒక్కొక్క వాహనాన్ని సమకూ ర్చారు. చెత్తను సేకరించిన తరువాత ఆ వాహనా లన్నిం టిని నగర పంచాయతీ కార్యాలయం ఎదుట పార్కింగ్‌ చేస్తున్నారు. వీటితో పాటు ప్రైవేటు వ్యక్తులకు చెందిన సెప్టిక్‌ క్లీనర్లను కూడా నగర పంచాయతీ వద్ద పార్కింగ్‌ చేస్తున్నారు. అక్కడ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట పార్కిం గ్‌ చేయవద్దని పదే పదే చైర్మన్‌ ఆదేశించినా సంబంధిత శాఖ అధికారులు స్పందించక పోవడాన్ని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:48 AM