Share News

చనిపోయినా ఓటు

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:57 AM

ఓటర్ల జాబితాలకు తుది మెరుగులు ఎన్ని అద్దినప్పటికీ ఇంకా అనేక లోపాలు వెలుగు చూస్తు న్నాయి. జాబితాల్లో అర్హుల ఓట్లు కనుమరుగై.. అనర్హుల పేర్దు దర్శనమిస్తున్నాయి.

చనిపోయినా ఓటు

చక్రద్వారబంధంలో 33 ఓట్లురాజానగరంలో వింత పరిస్థితి

ఓటర్ల తుది జాబితాలో ఇదీ తీరు

రాజానగరం, ఫిబ్రవరి 1 : ఓటర్ల జాబితాలకు తుది మెరుగులు ఎన్ని అద్దినప్పటికీ ఇంకా అనేక లోపాలు వెలుగు చూస్తు న్నాయి. జాబితాల్లో అర్హుల ఓట్లు కనుమరుగై.. అనర్హుల పేర్దు దర్శనమిస్తున్నాయి. అలాగే శాశ్వతంగా గ్రామాంతరం వెళ్లిన వారి పేర్లు, ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు (డబుల్‌ ఎంట్రీ)పేర్లు సైతం కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో జాబితాల రూపకల్పనలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు న్నాయి.రాజాన గరం మండలం చక్రద్వారబంధం గ్రామ ఓటర్ల జాబితానే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఇటీవల జనవరి 22న ప్రభుత్వం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం గ్రామంలో 170,171,172 పోలింగ్‌ కేంద్రాల్లో 3,463 మంది ఓటర్లు ఉన్న ట్టుగా ఆయా గ్రామ సచివాల యాలకు జాబి తాలు విడుదల య్యాయి. అయితే వీటిలో 170వ పోలింగ్‌ కేంద్రంలో జాబితాల్లో ఏకంగా 33 మంది మృతులకు ఓటు హక్కు కల్పించిన పేర్లు దర్శనమిచ్చాయి. గ్రామానికి చెందిన పిల్లా నాగేశ్వరరావు, పితాని రామ స్వామి, భూషంశెట్టి సీతారత్నం, సుంకర చక్రం, చిక్కాల సూర్యారావు, వనుం సూరమ్మ, ఏగి సూర్యారావు తది తరులు గత కొన్నేళ్ల కిందట మర ణించారు. మృతుల పేర్లు సైతం జాబితాల్లో పొందుపర్చి మృతులకు ఓటు హక్కు కల్పించడంపై గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో జాబితాల్లో లోపాలను ఆలస్యంగా గుర్తించిన బూత్‌ ఇన్‌చార్జ్‌ మాదబోయిన శ్రీను, యూనిట్‌ ఇన్‌చార్జ్‌ షోడసాని త్రిమూ ర్తులు ఓటర్ల జాబితాల్లో చేసుకున్న లోపాలను సవరించాలని కోరుతూ స్ధానిక బీఎల్‌వోకు వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు సవరణ షెడ్యూల్‌ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికి తమకేమీ పట్టనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు.రాజానగరం నియోజకవ ర్గంలో 216 పోలింగ్‌ కేంద్రాల్లో 2,13,911 మంది ఓటర్లు ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,05,824 మంది, మహిళలు 1,08,083 మంది, థర్డ్‌ జెండర్‌ 4 ఉన్నట్లుగా ఽప్రచురించి తుది జాబితాను విడుదల చేశారు. అయితే ఒక్క చక్రద్వార బంధం లోనే ఇన్ని లోపాలు వెలుగు చూస్తే నియోజకవర్గం మొత్తంగా ఎన్ని లోపాలు,అవకతవ కలు చోటు చేసుకుంటాయోనని తెలు గు తమ్ముళ్లు ఆందోళన చెందుతు న్నారు. జాబితాల్లో చోటు చేసుకున్న లోపాలను సవరించాలని కోరుతూ గ్రామంలోని బీఎల్‌వో మల్లికకు యూనిట్‌ ఇన్‌చార్జ్‌ త్రిమూర్తులు వినతి పత్రం అందజేశారు.

Updated Date - Feb 02 , 2024 | 12:57 AM