ఓటు..రూటు!
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:38 AM
సంక్రాంతి పండగ వెళ్లిపోయింది. ఓట్ల పండగ రానుం ది. ఇక సందడంతా ఎన్నికల మీదే. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.
త్వరలో ఎన్నికల నోటిఫికేషన్
సిద్ధమవుతున్న అభ్యర్థులు
త్వరలో టీడీపీ తొలిజాబితా
అదే బాటలో జనసేన
నాలుగో జాబితాకు వైసీపీ సన్నద్ధం
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
సంక్రాంతి పండగ వెళ్లిపోయింది. ఓట్ల పండగ రానుం ది. ఇక సందడంతా ఎన్నికల మీదే. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. గెలుపు గుర్రా లను ఎంపిక చేసుకునే ప్రకియ్రలో నిమగ్నమయ్యాయి. త్వరలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. తెలు గుదేశం- జనసేన పొత్తువల్ల ఆ పార్టీ నుంచి టికెట్లు ఆశించే వారి సంఖ్య బాగా పెరిగింది. సంక్రాంతి పండుగ తర్వాత టీడీపీ అభ్యర్థుల తొలిజాబితా వస్తుందని ప్రకటిం చిన సంగతి తెలిసిందే. జనసేన అభ్యర్థుల పేర్లు త్వరలోనే వెల్లడిస్తారు. జిల్లాలో ఒక లోక్‌సభ నియోజకవర్గం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీ పీకి రాజమహేంద్రవరం రూరల్, అర్బన్ దక్కాయి. టీడీపీ అధినేత సిట్టింగ్‌లకు మళ్లీ టికెట్లు ఇస్తామని గతంలో చేసిన ప్రకటన వల్ల రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అర్బన్ నుంచి ఆదిరెడ్డి కుటుంబం హుషారుగా పార్టీ పనిలో నిమగ్నమయ్యాయి. అనపర్తి, రాజానగరం, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు స్థానాల్లో గత ఎన్ని కల్లో టీడీపీ ఓటమి చెందింది. అందులో ఇప్పటికే గోపా లపురం ఇన్‌చార్జిగా మద్దిపాటి వెంకట్రాజు, రాజానగరం ఇన్‌చార్జిగా బొడ్డు వెంకటరమణను నియమించారు. అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీ కోసం పనిచేస్తున్నారు. నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, సీనియర్ నేత కుందుల సత్యనా రాయణ టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరూ పార్టీ కోసం పని చేస్తున్నారు.కొవ్వూరులో ఇన్‌చార్జిలేరు. ద్విసభ్య కమిటీ ఉంది. ఇంకా మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు టికెట్లు ఆశి స్తున్నారు.ఏది ఏమైనా అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించిన జాబితాలో ఉన్నవారే అభ్యర్థులవుతారు. కానీ టీడీపీకి జనసేనతో పొత్తు ఉండ డం వల్ల టీడీపీ అభ్యర్థుల టిక్కెట్ల ఖరారుపై టెన్షన్ నెల కొంది.జనసేన నుంచి కందుల దుర్గేష్ రాజమహేంద్ర వరం రూరల్ సీటు ఆశిస్తున్నారు. రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ టికెట్ ఆశిస్తున్నారు.కొవ్వూరు నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, నిడదవోలు నుంచి ఓ సినీ నిర్మాత జనసేన టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరు గుతోంది. కొద్దిరోజుల్లోనే టీడీపీ,జనసేన అభ్యర్థులెవరనేది తేలనుంది. వైసీపీలో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వేరే చోటకు బదిలీ అయ్యే పరిస్థితుల వల్ల గందరగోళం ఉంది. ఇప్పటికే రాజమహేంద్రవరం రూరల్‌కు మంత్రి చెలు ్లబోయిన వేణు, సిటీకి ఎంపీ మార్గాని భరత్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.మిగతా చోట్ల ఇంకా అధికారికంగా ఖరా రు కాలేదు. కొవ్వూరులో హోంమంత్రి తానేటి వనిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది బహుశా నాలుగో జాబితాలో స్పష్టత రావచ్చు. ఒకటి రెండు రోజుల్లో నాలుగో జాబితా ప్రకటించే అవకాశం ఉంది.ఆమెను కొవ్వూరు నుంచి కొం దరు వ్యతిరేకిస్తున్నారు.ఆమె కూడా గోపాలపురం వైపు చూస్తున్నట్టు ప్రచారం ఉంది.ఆమెను మారిస్తే మరి కొన్ని మార్పులు ఉండవచ్చు. రాబోయే ఎన్నికలు ప్రజలకు ఓట్ల పండగ, రాజకీయనేతలకు ఓట్ల పందెంగా మారనుంది.
ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా
రాజమహేంద్రవరం, జనవరి 17(ఆంధ్రజ్యోతి) : ఓటర్ల తుదిజాబితా ఈనెల 22న ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ డా. కె.మాధ వీలత తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. ఓటర్ల తుది జాబితా ప్రకటించినా నామినేషన్లు స్వీకరణ తుది రోజు వరకూ ఓటరుగా నమోదయ్యే అవకాశం ఉన్న ట్టు చెప్పారు. కొత్తగా నమోదు చేసిన వారి పేర్ల సప్లిమెంటరీ జాబితాగా ప్రకటిస్తామన్నారు. ఈవీఎంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి జన సమూహాలు ఉండే ప్రాంతాల్లో శాశ్వత సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అక్టోబరు 27నాటికి ఎస్‌ఎస్‌ఆర్ 2024 ముసాయిదా ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్లు 15,60,354 మంది ఉండగా అందులో 7,63,694 మంది పురుషులు 7,96,552 మంది మహిళలు 108 మంది ఇతరులు ఉన్నారన్నారు. కానీ జన వరి 1వతేదీ నాటికి ఈ సంఖ్య బాగా పెరిగిందని మొత్తం ఓటర్లు సంఖ్య 16,05,762 కాగా, పురుషులు 7,85,142 మహిళలు 8,20,515మంది ఉన్నా రన్నారు. సమావేశంలో జేసీ ఎన్.తేజ్‌భరత్, డీఆర్‌వో జే.నరసింహులు, ఆర్డీవో ఏ .చైత్రవర్షిణి తదితరులు పాల్గొన్నారు.