ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:49 AM
వేగేశ్వరపురంలోని 28వ పోలింగ్ స్టేషన్ వద్ద డ్రైనేజీ పనులు పూర్తి చేసి ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని, మరికొన్ని పోలింగ్‌స్టేషన్‌లలో చిన్న చిన్న లోపాలను సరిచేయాలని సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ సూచించారు.

తాళ్లపూడి, మార్చి 5:వేగేశ్వరపురంలోని 28వ పోలింగ్ స్టేషన్ వద్ద డ్రైనేజీ పనులు పూర్తి చేసి ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని, మరికొన్ని పోలింగ్‌స్టేషన్‌లలో చిన్న చిన్న లోపాలను సరిచేయాలని సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని తాళ్లపూడిలో 20,21 పోలింగ్‌స్టేషన్లు, వేగేశ్వరపురంలో 25,26,27,28 పెద్దేవంలో 31,32,34 మలకపల్లిలో 39,40,41,42 పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే పలు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను, వాటి పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంట తహశీల్దార్ శ్రీనివాసరావు, ఆర్‌ఐ కిషోర్, సచివాలయ సిబ్బంది ఉన్నారు.