Share News

ఓట్ల ఉప్పెన

ABN , Publish Date - May 15 , 2024 | 01:37 AM

జిల్లాలో ఓటు చైతన్యం వెల్లువెత్తింది. ఓటుహక్కును ప్రజలు వజ్రాయుధంగా మల్చుకున్నారు. తమకున్న హక్కును అర్ధరాత్రి దాటినాసరే విసుగుచెందక బాధ్యతగా భావించారు.

ఓట్ల ఉప్పెన

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

2014, 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి భారీ పోలింగ్‌

జిల్లాలో 16,34,122 మందికి 13,12,297 మంది ఓటుహక్కు వినియోగం

8,29,471 మంది మహిళా ఓటర్లలో 6,59,596 మంది ఓటేసిన వైనం

పురుష ఓటర్లు 8,04,465కిగాను 6,52,599 మంది ఓటు వేసిన వైనం

గత ఎన్నికల్లో ఎప్పుడూ లేనివిధంగా బూత్‌ల ముందు యువతరం బారులు

పోటెత్తిన యువత ఓట్లతోనే పోలింగ్‌ శాతం పెరిగినట్టు అధికారుల అంచనా

మంగళవారం తెల్లవారుజాము వరకు అనేకచోట్ల కొనసాగిన పోలింగ్‌

అత్యధికంగా పిఠాపురం నియోజకవర్గంలో 86.63 శాతం నమోదు

గత ఎన్నికలతో పోల్చితే పిఠాపురం నియోజకవర్గంలో 5.62 శాతం పెరుగుదల

కాకినాడ సిటీలో అత్యల్పంగా 72.17శాతం మంది ఓటుహక్కు వినియోగం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఓటు చైతన్యం వెల్లువెత్తింది. ఓటుహక్కును ప్రజలు వజ్రాయుధంగా మల్చుకున్నారు. తమకున్న హక్కును అర్ధరాత్రి దాటినాసరే విసుగుచెందక బాధ్యతగా భావించారు. తిండి, నీరు లేకపో యినా క్యూలైన్ల నుంచి కదల్లేదు. ఇళ్లు.. ఊళ్లు.. ఏకమై పోలింగ్‌ బూత్‌లకు పోటెత్తాయి. దీంతో జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మునుపెన్నడూ లేనంతంగా ఓ ఉద్యమంలా ప్రజలు కదిలారు. దీంతో మంగళవారం తెల్లవారుజామువరకు అనేక బూత్‌ల్లో పోలింగ్‌ జరిగింది. గతంలో ఎప్పుడూ లేనిరీతిలో ఓటర్లు అర్ధరాత్రి అయినా కదలకుండా మెదలకుండా ఓ తపస్సులా భావించి ఓటేశారు. ఫలితంగా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌శాతం ఏకంగా 80.31 శాతం నమోదైంది. గత పదేళ్లలో ఈస్థాయి ఓటింగ్‌ జరడం ఇదే తొలిసారి. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఏకంగా పోలింగ్‌ శాతం 1.79 శాతం పెరిగింది. పెరిగిన ఓటింగ్‌ శాతం అంతా యువతదేననే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ లేనిది ఈ దఫా జిల్లాలో యువతరం ఉప్పెనలా బూత్‌ల్లో పోటెత్తారు. దీంతో అనూహ్య రీతిలో పోలిం గ్‌శాతం పెరిగింది. అర్ధరాత్రి వరకు వందలాది బూత్‌ల్లో నిలబడిందీ యువతరమే. ఇక జిల్లాలో మొ త్తం 16,34,122మంది ఓటర్లకుగాను ఏకంగా 13,12,297 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా పిఠాపురం నియోజకవర్గంలో 86.63 శాతం పోలింగ్‌ జరగ్గా, గత ఎన్నికలతో పోల్చితే ఏకంగా 5.62శాతం పెరుగుదల నమోదైంది. కాకినాడసిటీలో అత్యల్పంగా 72.17 శాతం పోలింగ్‌ నమోదైంది. సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఓటర్లు పోలింగ్‌బూత్‌లకు అనుహ్యంగా పోటెత్తారు. పోలింగ్‌ ప్రక్రియ అర్ధరాత్రి అయినా పట్టువదలని విక్రమార్కుల్లా నిలబడ్డారు. కరెంట్‌ లేకపోయినా, బూత్‌లో అసలు విద్యుత్‌ వసతి లేకపోయినా, అటు ఓపక్క వర్షం, మరోపక్క సర్వర్ల మొరాయింపు, ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోయినా ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించారు. పోతేపోనీ నా ఒక్క ఓటే కదా అన్న ఆలోచనే లేకుండా ఓటుకోసం జాగారం సైతం చేశారు. ప్రధా నంగా యువతరం ఈసారి జిల్లాలో ఓటుహక్కును సంపూర్ణంగా వినియోగించుకుంది. ఎన్నికల్లో ప్రచా రాల్లో సందడి చేయడం మినహా ఓటేయరనే అపప్రదను యువత చెరిపేసింది. పట్టుదలగా ప్రతి ఒక్కరు ఈసారి ఓటువేశారు. దీంతో జిల్లాలో అనూహ్యంగా పోలింగ్‌శాతం పెరిగిపోయింది. సాధార ణంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాత్రికి మొత్తం పోలింగ్‌ శాతం వెల్లడవడం ఆనవాయితీ. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం రావడానికి దాదాపు ఒకరోజు పట్టిందంటే ఏస్థాయిలో బూత్‌ల్లో జనం ఓటుతో పోటెత్తారో అర్థం చేసుకోవచ్చు. పోలింగ్‌ ముగిసిన తర్వాత జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌రూంలకు రాత్రి పది గంటలకు రావలసిన ఈవీఎంలు మంగళవారం ఉదయం పది వరకు వస్తూనే ఉన్నాయంటే ఏ స్థాయిలో కసిగా ఓటర్లు ఓటు వేశారో అర్థం చేసుకోవచ్చు.

ఏ నియోజవర్గంలో ఎలా అంటే...

జిల్లాలో మొత్తం 16,34,122 మంది ఓటర్లున్నారు. వీరిలో ఎన్నికల్లో ఏకంగా 13,12,297 మంది ఓటు హక్కు వినియోగించుకు న్నారు. దీంతో జిల్లాలో పోలింగ్‌శాతం 80.31గా న మోదైంది. వాస్తవానికి 20 14 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పోలింగ్‌ శాతం 77.13 శాతంగా నమోదైంది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జిల్లాలో పోలింగ్‌శాతం 78.52గా తేలింది. అంటే 1.39శాతం పెరిగింది. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌శాతం 80.31గా తేలడంతో అప్పటికి ఇప్పటికి పోలింగ్‌శాతం 1.79శాతం పెరిగినట్టయింది. వాస్తవానికి పోలింగ్‌ శాతం ఈ స్థాయిలో పెరగడం వెనుక ఈసారి యువతరం ఓటుహక్కును భారీగా వినియో గించుకోవడమే కారణమని చెప్పాలి. ప్రధానంగా జిల్లాలో ఈసారి టీడీపీ, జనసేన కలిసిపోటీ చేశాయి. దీంతో యువతరం ఎక్కువగా బూత్‌లకు వచ్చి కూటమికి మద్దతుగా నిలిచాయి. అటు పవన్‌ జిల్లా నుంచే పోటీచేస్తుండడం, ఆయన పార్లమెంట్‌ అంతా సభలు, రోడ్డుషోలు నిర్వహించారు. చంద్రబాబు కూడా విస్తృతంగా తిరిగారు. దీంతో ప్రతి ఒక్కరు ఓటింగ్‌కు వచ్చి కూటమికి మద్దతుగా ఓటెత్తారు. అలాగే జిల్లాలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు సైతం భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో 8,29,471 మంది మహిళా ఓట ర్లకుగాను 6,59,596 మంది ఓటేశారు. పురుష ఓటర్లు 8,04,465కి 6,52,599మంది ఓటు హ క్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా పిఠాపురం నియోజకవర్గంలో ఏకంగా 86.63 శాతం పోలింగ్‌ నమోదైంది. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్‌ 79.03ు. 2019లో 81. 01గా నమోదైంది. ఈసారి ఏకంగా 86.63ుగా తేలింది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఏకంగా 5.62 శాతం అధికంగా నమోదైంది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,36,409 మందికాగా ఏకంగా 2,04,811 మంది ఓటేశారు. జగ్గంపేటలో మొత్తం 2,29,863 మంది ఓట ర్లుండగా, 1,92,287మంది ఓటేశారు. దీంతో ఇక్కడ పోలింగ్‌శాతం 83.65శాతంగా తేలింది. గత ఎన్నికల్లో 85.71 శాతంతో అత్యధిక పోలింగ్‌శాతం నమోదైన నియోజకవర్గంగా జగ్గంపేట రికార్డుకెక్కింది. కానీ ఈసారి 2.06 శాతం ఓటింగ్‌ తగ్గింది. తునిలో గత ఎన్నికల్లో 82.84శాతం ఓట్లు పోలవగా, ఈసారి ఎన్నికల్లో 83.38 శాతం నమోదైంది. పెద్దాపురం నియోజకవర్గంలో 82.29 శాతం ఓటింగ్‌ జరిగింది. నియోజకవర్గంలో మొత్తం 2,15,095 మందికిగాను 1,76,993 మంది హక్కు వినియోగించుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్‌శాతం 81.37 శాతం. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మొత్తం 2,17,267మందికిగాను 1,74,788మంది ఓట్లు వేశారు. పోలింగ్‌శాతం 80.45. 2019 ఎన్నికల్లో 80.99. కాకినాడ రూరల్‌ నియోజవర్గంలో ఈసారి 74.94శాతం పోలింగ్‌ జరిగింది. 2,69,330మందికి, 2,01,833 మంది ఓట్లేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్‌శాతం 74.07. కాకినాడసిటీలో మొత్తం 2,41,620మంది ఓట ర్లకుగాను ఎన్నికల్లో 1,74,370మంది ఓట్లేశారు. దీంతో పోలింగ్‌శాతం అత్యల్పంగా 72.17శాతం నమోదైంది. గత ఎన్నికల్లో 66.77 శాతం పోలింగ్‌ జరగ్గా, ఈసారి 5.4శాతం ఓట్లుపెరిగాయి.

ఓటు పై అవగాహనతో గణనీయంగా ఓటింగ్‌ : జిల్లా కలెక్టర్‌ నివాస్‌

కలెక్టరేట్‌ (కాకినాడ), మే 14: కాకినాడ జిల్లాలో ఓటుపై అవగాహన సదస్సులు ఎక్కువగా నిర్వహించడం వల్ల ఓటింగ్‌ శాతం గణనీయంగా నమోదైందని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజవర్గాలు కలిపి ఓటింగ్‌ శాతం 80.31 నమోదైందన్నారు. ప్రజాభాగస్వామ్యంతో జిల్లాలో విస్తృతంగా నిర్వహించిన స్వీచ్‌ కార్యక్రమాలు ఇందుకు దోహదం చేశాయాన్నారు. అర్హులైన వారందరూ ఓటర్లుగా నమోదు కావడంతోపాటు ఓటుహక్కు ప్రాధాన్యతను గుర్తించి బాఽధ్యతగా వినియోగించుకునేలా చైతన్య పరిచాయన్నారు. ఈ ఉద్యమంలో చురుకైన భూమిక వహించిన జేఎన్‌టీయూ, రంగారాయ వైద్య కళాశాలల విద్యార్థులు, లాయర్లు, మత్యకార పెద్దలు, ఆటో డ్రైవర్లు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే యువ నేపథ్య గాయకుడు యశస్వీ కొండేపూడి సహకారంతో చిత్రీకరించిన వీడియో గీతాలు ఎంతగానో దోహదపడ్డాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.

జేఎన్‌టీయూకే విశ్వవిద్యాలయం పరిధిలో 144 సెక్షన్‌ అమలు

కలెక్టరేట్‌(కాకినాడ), మే 14 : కాకినాడ జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం నుంచి 144 సెక్షన్‌ అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలోని కాకినాడ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఈవీఎం, వీవీ ప్యాట్స్‌లను జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయంలో బ్లాకుల్లో సిద్ధం చేసిన స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరచడం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర పోలీస్‌ బలగాలతో మూడం చెల భద్రతను స్ట్రాంగ్‌ రూముల వద్ద ఏర్పాటుచేశామన్నారు. మంగళవారం నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం చుట్టూ ఒక కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్‌ పటిష్టంగా అమలుచేయడం జరుగుతుందన్నారు.

Updated Date - May 15 , 2024 | 08:06 AM