Share News

‘మాదిగల ఓట్లు అడిగే హక్కు వైసీపీకి లేదు’

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:54 AM

మాదిగలను ఓట్లు అడిగే హక్కు వైసీపీకి లేదనిమాదిగ సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం ముమ్మిడివరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబును జేఏసీ నాయకులు కలిశారు.

‘మాదిగల ఓట్లు అడిగే హక్కు వైసీపీకి లేదు’

ఐ.పోలవరం, ఏప్రిల్‌ 26: మాదిగలను ఓట్లు అడిగే హక్కు వైసీపీకి లేదనిమాదిగ సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం ముమ్మిడివరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబును జేఏసీ నాయకులు కలిశారు. మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలుచేసిన పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన మాత్రమేనన్నారు. ఎస్సీ వర్గీకరణ, మాదిగల డిమాండ్లను కూటమి అంగీకరించిందన్నారు. మాదిగలకు టీడీపీ 14, బీజేపీ ఒక స్థానం కేటాయించి ఎన్నికల్లో అగ్ర స్థానం కల్పించిందన్నారు. కూటమి అభ్యర్ధులు హరీష్‌మాధుర్‌, దాట్ల బుచ్చిబాబులకు సైకిల్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మాదిగలకు పిలుపునిచ్చారు. బుచ్చిబాబును కలిసిన వారిలో జేఏసీ గౌరవ అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నమాదిగ, చెయ్యేటి శ్రీనుబాబు, వీధి నాగభూషణం, తాతపూడి నాగేశ్వరరావు, వీధి లోవరాజు, వీధి శేఖర్‌బాబు, సత్తాల కృష్ణ ఉన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:54 AM