ఓటు నమోదుకు 14 వరకూ అవకాశం
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:51 AM
జిల్లాలో 2024 ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్ళు నిండి యువత ఈ నెల 14 వ తేదీలోపు ఓటు నమోదు చేయించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కే.మాధవీలత తెలిపారు.

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్ 2 : జిల్లాలో 2024 ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్ళు నిండి యువత ఈ నెల 14 వ తేదీలోపు ఓటు నమోదు చేయించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కే.మాధవీలత తెలిపారు. ఓటరు ఫారం 6 ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. 18 ఏళ్ళు నిండిని యువత స్వచ్ఛందంగా ముందకు వచ్చి ఆన్‌లైన్‌లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నేపధ్యంలో బదిలీపై వచ్చిన అధికారులు ఫారం 8 ద్వారా తమ ఓటు హక్కును బదిలీ చేసుకోవడం లేదా చిరునామా మార్పునకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 14వ తేదీలోగా ఈసీఐ వెబ్‌సైట్ లేదా, ఓటరు హెల్ప్ లైన్‌లో దరఖాస్తుకు ఇదే చివరి అవకాశమని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్‌పై కలెక్టరేట్‌లో అత్యవసర సేవలు అందించే అధికారులతో సమావేశం నిర్వహించి పలు ఆదే శాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ పొందడానికి ఫారం 12 డి ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన సమగ్రసమాచారాన్ని నోడల్ అధికారి , జిల్లా హౌసింగ్ అధికారి ముత్యాల శ్రీనివాస్ ద్వారా నేరుగా పొందవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌వో జి . నరసింహులు, హౌసింగ్ పీడీ ఎం.శ్రీనివాస్, డీసీవో ఆర్ శ్రీనివాస్ నాయుడు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.