Share News

వలంటీర్‌లే ప్రచార అస్త్రాలు

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:59 AM

వలంటీర్లు వైసీపీ సైన్యం అంటూ సాక్షాత్తూ సీఎం జగన్‌ బహిరంగంగా ప్రకటించారు. ఈ మాటలను ఇప్పుడు వలంటీర్లు నిజం చేస్తున్నారు. వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచడం.. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వేటు వేయడంతో రాజీనామాల పర్వానికి తెరతీశారు.

వలంటీర్‌లే ప్రచార అస్త్రాలు
గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో రాజీనామా చేసిన వలంటీర్లు

  • రాజీనామా చేయించి రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు

  • వైసీపీ నాయకులే నెల జీతాలు ఇచ్చేందుకు ఒప్పందాలు

  • వారంరోజుల్లో మొత్తం వలంటీర్ల రాజీనామాలతో ప్రణాళిక

  • క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న 11273మంది వలంటీర్లు

తుని రూరల్‌, ఏప్రిల్‌ 6: వలంటీర్లు వైసీపీ సైన్యం అంటూ సాక్షాత్తూ సీఎం జగన్‌ బహిరంగంగా ప్రకటించారు. ఈ మాటలను ఇప్పుడు వలంటీర్లు నిజం చేస్తున్నారు. వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచడం.. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వేటు వేయడంతో రాజీనామాల పర్వానికి తెరతీశారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికలో పాల్గొంటే తర్వాత మీ ఉద్యోగం మీకు దక్కుతుందని వైసీపీ నాయకులు ఒత్తిడి తీసుకురావడంతో జిల్లాలో చాలాచోట్ల వలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. తుని నియోజకవర్గంలోని 300మందికి పైబడి రాజీనామా పత్రాలను స్థానిక అధికారులకు అందజేశారు.

నాయకులే జీతాలు ఇచ్చేలా ఒప్పందం

ఇప్పటికే వలంటీర్లు నాయకుల ప్రచారాల్లో కార్యకర్తల్లా పాల్గొంటున్నారు. పరోక్షంగా పథకాల పేరుతో ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వారు విధుల్లో ఉండి ప్రచారం చేయడం నియమావళికి విరుద్ధం కావడంతో వైసీపీ కొత్త వ్యూహం తెరపైకి తీసుకొచ్చింది. రాజీనామా చేసిన వలంటీర్‌కు జీతం రానందున నాయకులే వీరికి కొంత మొత్తంలో నగదు ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వలంటీర్లకు తాయిలాలు అందాయి. ఒక్క తునిలోనే 1700మంది వలంటీర్లకు సెల్‌ఫోన్‌లు పంపిణీ చేయడం పలు విమర్శలకు తావిచ్చింది. ఎన్నిక ల వరకు ప్రభుత్వ పథకాల గురించి వైసీపీ రాకుండా పథకాలు ఆగి పోతాయని ప్రచారం చేయడంతోపాటు టీడీపీ వస్తే వాటిని రద్దు చేస్తారని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే వారి పని. మీరు జగన్‌కు ఓటు వేశారో లేదో మాకు తెలుస్తుంది. ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తాం.. అని వారికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎ న్నికల కోడ్‌ రాకముందే వలంటీర్లతో విందు భోజనాలతోపాటు తాయిలాలు చక్కబెట్టేశారు. ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాల్లో వలంటీర్లను దూరం చేయడం వైసీపీ నాయకులకు రుచించలేదు. వలంటీర్లతో ప్రచారానికి ఎలాంటి అడ్డంకులూ ఉండకూడదనే రాజీనామా పర్వాలు తెరతీశారు. అనుకున్నదే తడువుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వీర విధేయులుగా ఉన్న వలంటీర్లతో తొ లుత రాజీనామాలు చేయిస్తున్నారు. అక్కడితో ఆగకుండా మిగిలిన వారితో రాజీనామాలు చేయిస్తున్నారు. ఇష్టం లేకపోయినా గుంపులో కలిసిపోయి రాజీనామాలు చేస్తున్నారు. ఇదే ఒరవడి తుని నియోజకవర్గానికి పాకింది. ఇక్కడ మూడు రోజులుగా రాజీనామాల పర్వం కొ నసాగుతోంది. ఇప్పటికే నియోజకవర్గంవ్యాప్తంగా 300మందికి పైబడి రాజీనామాలు చేసినట్లు అధికారులు ప్రకటిస్తున్నారు. నియోజకవర్గా ల పరిధిలో ఆ పార్టీ నేతలు గ్రామాలవారీగా వలంటీర్లతో రహస్య మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వారంవ్యవధిలో జిల్లాలో వలంటీర్లతో రాజీనామా చేయిస్తున్నట్టు తెలుస్తోంది. చాలామంది రాజీనామాలకు కారణాలు చూపకుండానే లేఖలు ఇవ్వడంతో వాటిని ఆమోదించాలా.. లేదా అనే సందిగ్ధంలో అధికారులు ఉన్నారు.

క్షేత్రస్థాయిలో 11273 మంది వలంటీర్లు

జిల్లాలో 21మండలాల్లో 620 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నా యి. వాటి పరిధిలో 11,273మంది వలంటీర్లుగా సేవలు అందిస్తున్నా రు. వలంటీర్లు రాజీనామాలు చేసిన వెంటనే విపక్ష పార్టీలపై దుష్ప్రచారమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నారు. గతంలో పింఛన్‌ సొమ్ము మేము ఇంటికి తీసుకొచ్చే వాళ్లమని, చంద్రబాబు కూటమి నాయకులు చేసిన కుట్రతో ఇక నుంచి అందే పరిస్థితి లేదని దీన్ని అంగీకరిస్తారా.. ఇలాగే మీరు సచివాలయాలవద్ద కూర్చొని గంటల కొద్దీ వేచి ఉండి పింఛన్లు తీసుకుంటారా... లేకపోతే వలంటీర్లు కావాలని కోరుకుంటారా.. మరోమారు మీ ఇంటికి ప్రభుత్వ పథకాలు రావాలంటే జగన్‌కే ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

తాటిపర్తిలో వలంటీర్లు రాజీనామా

గొల్లప్రోలు రూరల్‌, ఏప్రిల్‌ 6: ఎన్నికల ముందు వైసీపీ రకరకాల కుయుక్తులను పన్నుతోంది. ఇందులో వలంటీర్లను పావులుగా చేసుకొంది. వారితో రాజీనామాలు చేయించి ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేయడంతోపాటు వారిని రాజకీయంగా వినియోగించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులోభాగంగానే జిల్లావ్యాప్తంగా వలంటీర్లతో రాజీనామాలు చేయిస్తున్నారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని సచివాలయం 1, 2 పరిధిలో 53మంది వార్డు వలంటీర్లు తమ పదవులకు శనివారం రాజీనామాలు చేశారు. ఈ మేరకు వార్డు సచివాలయ అడ్మిన్‌కు సామూహికంగా రాజీనామాలు అందజేశారు. రాజీనామాలను ప్రత్యక్షంగా ఇవ్వాలని అడ్మిన్‌ రాజేంద్ర సూచించారు. దీంతో 37మంది ప్రత్యక్షంగా హాజరై తమ రాజీనామాలను అందజేశారు. మరో 16మంది హాజరుకాలేదు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాము వలంటీర్లుగా చేరామని వారు తెలిపారు. తమను చులకన చేసేలా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడడం తమను మనస్తాపానికి గురిచేసిందని వారు చెప్పారు.

Updated Date - Apr 07 , 2024 | 12:59 AM