Share News

రాజీడ్రామాలు!

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:50 AM

ఎన్నికల కోడ్‌ రావడంతో వలంటీర్లను విధుల నుంచి తొలగించారు.. ఇదే అదునుగా అధికార పార్టీ నాయకులు అధిష్ఠానం ఆదేశాల మేరకు పావులు కదుపుతున్నారు.. వలంటీర్లను ఆశపెట్టి రాజీనామాలు చేయించి నయానో భయానో తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఆరంభించారు..

రాజీడ్రామాలు!
రాజీనామాలు చేసి ఏం చేస్తారు? : కోరుకొండలో శుక్రవారం 64 మంది వలంటీర్ల రాజీనామా

అధికార పార్టీ నాయకుల బెదిరింపుల ఉచ్చు

రాజీనామా చేయాలంటూ హుకుం

ఆగని అరాచకీయం..మరోవైపు ప్రలోభాల వల

మళ్లీ వైసీపీ వస్తే..అందలమంటూ అబద్ధాలు

అది జరిగే పని కాదని..వెనక్కి తగ్గుతున్న వలంటీర్లు

ఎంతో కొంత చదువుకున్నారు.. ఖాళీగా ఉండలేక వలంటీర్‌ ఉద్యోగంలో చేరారు..గత ఐదేళ్లుగా ప్రజలకు దగ్గరయ్యారు. ప్రతి నెలా పింఛన్‌ డబ్బులు ఎప్పుడు తెస్తారోనని పింఛనుదారులు ఎదురు చూస్తే.. ఏ పథకం సమాచారం మోసుకొస్తారోనని సాధారణ ప్రజానీకం ఎదురుచూశారు.. జగన్‌ వలంటీర్లను జనానికి అంతలా అలవాటు చేశారు.. వారినే ఉపయోగించి ఎన్నికలకు వెళ్లాలని జగన్‌ భావించారు. అయితే ఎన్నికల కోడ్‌ రావడంతో వలంటీర్లను విధుల నుంచి తొలగించారు.. ఇదే అదునుగా అధికార పార్టీ నాయకులు అధిష్ఠానం ఆదేశాల మేరకు పావులు కదుపుతున్నారు.. వలంటీర్లను ఆశపెట్టి రాజీనామాలు చేయించి నయానో భయానో తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఆరంభించారు.. నాడు కాదు.. నేడూ చదువుకున్న యువతరం జీవితాలతో ఆడుకుంటున్నారు.. ఎన్నికల వేళ ఎవరైనా వలంటీర్లు చిక్కితే.. కేసు నమోదైతే వాళ్ల జీవితం నాశనమైనట్టే సుమా.. వలంటీర్లు తస్మాత్‌ జాగ్రత్త..

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత వలంటీర్లు ఇటీవల రాజీనామాల బాట పట్టారు. నోటిఫికేషన్‌కి ఇంకా అతి కొద్ది రోజులు సమయం ఉండగా ఆ పరంపర మరీ ఊపందుకొంది. అయితే తన సైన్యమని జగన్‌ చెప్పుకున్న ఉద్యోగులు/సేవకులు ఎందుకు నెల రోజుల నుంచీ ఇలా ప్రవర్తిస్తున్నారు?. పీజీలు చదివి కూడా నెలకు కేవలం రూ.5 వేలకు సేవకు వచ్చిన వలంటీర్లు సరిగ్గా ఐదేళ్ల తర్వాత.. మళ్లీ ఎన్నికల వేళ ఎందుకు ఉద్యోగాలను వదిలేస్తున్నారు?. ఏ వ్యవస్థలోనూ లేని విధంగా మూకుమ్మడిగా ఎం దుకు బయటకు వెళ్లిపోతున్నారు?. వైసీపీ నాయకుల ఒత్తిడి, ప్రలోభాల చట్రంలో వలంటీర్లు నలిగిపోతు న్నారని ఆ ప్రశ్నలకు జవాబులు వినవస్తున్నాయి.

త్యాగమా? స్వార్థమా?

దేశంలో ఎక్కడా లేని ఓ వ్యవస్థను జగన్‌ అస్తవ్య స్తంగా సృష్టించారు.లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నెలకు రూ.5 వేలు గౌరవ భృతితో ఉన్నతంగా చదువు కున్న వారిని సైతం రాజకీయ సేవ ఉచ్చు లోకి లాగారు. ప్రభుత్వ ఉద్యో గాలకు నోటిఫికేషన్లు లేకపోవడంతో వలంటీరు సేవనే మహాప్రసాదంగా యువత ఎంచుకున్నారు. జాబు చార్టు, ఉద్యోగ భద్రత వంటివేమీ లేకుండా ఐదేళ్ల సమయాన్ని వైసీపీ పాలకులకు ధార పోశారు. ప్రభుత్వ పథకాలను ఇంటి వద్దకే పంపిణీ పేరుతో వలంటీర్లను రాజకీయ స్వార్థం కోసం వాడు కున్నారు.ఎన్ని కల వేళ కోడ్‌ వచ్చిన తరు వాత అయినా వదిలారా అంటే అదీ లేదు. వలం టీర్లను ఇక నేరుగా రాజకీయ ప్రయోజనాలకు వైసీపీ పాలకులు వాడుకునే ఎత్తు వేస్తున్నారు. గత ఐదేళ్లుగా కుటుంబాలతో వలంటీర్లకు ఓ మౌన అనుబంధం ఏర్పడింది. దాంతో రాజ కీయంగా లబ్ధి పొంద డానికి వైసీపీ కుతంత్రా లు పన్నుతుంద నడంలో సందేహం లేదు. ఇవన్నీ గమనిస్తున్న జనం విస్తు పోతున్నారు.

వలంటీర్లు లేకపోతే?

వలంటీర్ల గురించి పూర్తిగా తెలుసుకున్న ఎన్నికల సంఘం..వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రక్రియ లో వినియోగించకూడదంటూ ఆదేశాలు జారీ చేసిం ది.దీంతో జగన్‌ ఖంగుతిన్నారు. వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో వలంటీర్లతో ఇంటింటా ప్రచా రం చేయించుకుందామని జగన్‌ అనుకొన్నారు. కానీ దానికి ప్రజాస్వామ్యం అడ్డుకట్ట వేసింది. వలం టీర్లు లేకపోతే అసలు పాలనే ఆగిపోతుందనే విధంగా ప్రభుత్వం వలంటీర్లను పురిగొల్పింది. కానీ వలం టీర్లు లేకుండానే ఈ నెల పింఛన్ల పంపిణీ సజావుగా సాగింది. దీంతో వలంటీర్లను జగన్‌ ప్రతి క్షణం తన స్వార్థం కోసం మభ్యపెడుతున్నారనే విషయం బహి ర్గతమైంది. వలంటీర్లకు చంద్రబాబు వ్యతిరేకం కాదు. ప్రభుత్వం నుంచీ వేతనం పొందు తున్న వలంటీర్లు వైసీపీకి అనుకూలంగా రాజకీయం చేయడం తప్పని మాత్రమే చెబుతున్నారు. పైగా టీడీపీ ప్రభుత్వం వచ్చాక వలంటీర్లకు నెలకు రూ.10 వేల వేతనంతో పాటు నైపుణ్య శిక్షణ ఇస్తామంటూ హామీ ఇచ్చారు.

రాజీనామా చేస్తారా? లేదా?

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచీ వలం టీర్ల చుట్టూ రాజకీయం అల్లుకుపోయింది. గెలుస్తా మనే నమ్మకం సన్నగిల్లడం, జగన్‌తో సహా వైసీపీ నాయకుల మాటలను జనం పట్టించుకోక పోవడంతో వలంటీర్ల ‘సేవ’ను ఎలాగైనా ఎన్నికల్లో ఉపయోగించు కోవాలని వైసీపీ కుట్ర పన్నుతోంది. దీనిలో భాగంగా వలంటీర్లను నయానో భయానో నలిపేస్తున్నారు. కొందరు వైసీపీ నాయకులు నేరుగానే వలంటీర్లపై బెదిరింపులకు దిగుతున్నారు. రాజీనామా చేసి తాము చెప్పినట్టు వింటే రేపు తమ ప్రభుత్వం వస్తే తిరిగి ఉద్యోగాలిస్తామని..రాజీనామా చేయని వాళ్లను తొలగి స్తామంటూ బెదిరిస్తున్నారు. దీంతో మానసికంగా కాస్త నెమ్మదిగా ఉన్నవాళ్లు భయపడి రాజీనామాల బాట పడుతున్నారు. వారిని చూసి మరి కొందరు ఉద్యోగాలు వదులుకుంటున్నారు. సాధారణంగా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే మెరుగైన ఉద్యోగం లభిస్తేనో లేకపోతే ఆరోగ్య కారణాల వల్ల రాజీనామాలు చేయడం జరుగుతుంది. కానీ ఎలాంటి బలమైన కారణం లేకుండానే వలంటీర్లు గంపగుత్తగా రాజీనామాలు చేస్తున్నారు. తాత్కాలిక ప్రలోభాలకు ఆశపడి కొందరు, పాలకుల ఒత్తిడి తట్టుకోలేక మరి కొందరు, మనసు చంపుకొని ఇంకొందరు తమ ఉద్యో గాలకు రాజీనామా చేస్తున్నట్టు సమాచారం. రాజీనా మాలు చేసిన వారిని నేరుగా రాజకీయాల్లో వినియో గించుకోవాలని వైసీపీ యోచిస్తోంది. అలా జరిగితే జగన్‌ తన రాజకీయ లబ్ధి కోసమే వలంటీరు వ్యవ స్థను నిర్మించుకున్నారనే విషయం నిజమని తేలు తుంది. రాజీనామాలు చేసిన వలంటీర్లను సైతం రాజ కీయ ప్రక్రియకు దూరం పెట్టాలని ఇప్పటికే ఎన్నికల సంఘానికి పౌర సంఘాలు లేఖలు రాస్తున్నాయి.

తూర్పులో 700మందికిపైగా

అధినాయకత్వం మౌఖిక ఆదేశాలతో వైసీపీ నాయకులు వలంటీర్లతో రాజీనామాలు చేయించే దాష్టీకాన్ని కొనసాగిస్తున్నారు. వైసీపీ నాయకులు నేరుగా వలంటీర్ల వద్దకు వెళ్లకుండా ఇప్పటికే రాజీ నామా చేసిన వాళ్లతో రాయబారం నడిపిస్తు న్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 9 వేల మంది వలంటీర్లు ఉండగా సుమారు 700 మంది వరకూ రాజీనామాలు చేశారు. రాజీనామా చేస్తే భవిష్యత్తులో బాగా ‘చూసుకుంటామని’, రాజీనామా చేసిన వాళ్లు తాము చెప్పినట్లు చేస్తే నెలకు రూ.25 వేల వరకూ అనధికారికంగా ముట్టజెబుతామని ఆశ పెడుతు న్నారు. అయితే ఇక్కడ ఓ విషయం నిగూఢంగా దాగి ఉండడం గమనార్హం. జిల్లాలో 9వేల మంది వలం టీర్లకు పది శాతం మంది కూడా రాజీనామా బెది రింపులకు లొంగలేదనే విషయం సుస్పష్టం. వైసీపీ ఫ్యాను పనైపోయిందని ప్రజలతో పాటు వలంటీర్లకు కూడా బోధపడడంతో చాలా మంది వలంటీర్లు రాజీ నామాలను తిరస్కరిస్తున్నారని సమాచారం. చంద్ర బాబు సీఎం అయితే తమ జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని విశ్వసిస్తుండడమే ఇందుకు కారణం.

Updated Date - Apr 14 , 2024 | 12:50 AM