గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:03 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సా రించామని, ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెప్పారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సోమవారం మురమండ, కడియపులంక గ్రామాల్లో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ఆయన శంకుస్థాపనలు నిర్వహిం చారు.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
పలుచోట్ల పల్లె పండుగ కార్యక్రమాలు
కడియం, అక్టోబరు 21: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సా రించామని, ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెప్పారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సోమవారం మురమండ, కడియపులంక గ్రామాల్లో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ఆయన శంకుస్థాపనలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసమే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెపాప్పరు. అనంతరం కడియపులంక బృందావన అతిథి గృహంలో తాత్కాలిక ఆరోగ్యకేంద్రాన్ని ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంబించారు. కా ర్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మా ర్గాని సత్యనారాయణ, గంగుమళ్ల సత్యనారాయణ, ప్రత్తిపాటి రామారావుచౌదరి, దేవళ్ల రాంబాబు, వట్టకూటి జానకీరామ్, గట్టి సుబ్బారావు, పాటంశెట్టి రాంజీ, గట్టి నర్సయ్య, మల్లు పోలరాజు తదితరులు పాల్గొన్నారు.