గ్రామీణ రహదారులకు మహర్దశ
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:57 AM
కూటమి ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లకు మహా ర్దశ పట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయి. గ్రామాల్లో ఒక్క రోడ్డు నిర్మాణం కూడా చేపట్టలేదు. దీంతో గ్రామాల్లోని రహదారులు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ము రుగు కాలువల నిర్మాణాలు చేపట్టకపోవడంతో మురుగునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో మురికి కూపాలుగా మారాయి. కూటమి ప్రభుత్వం అధి కారంలోకి రాగానే సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకువచ్చారు.
గత వైసీపీ పాలనలో అధ్వానంగా మారిన వైనం
కూటమి ప్రభుత్వంలో నిధుల వరద
జిల్లాలో 145.11 కి.మీటర్ల మేర 1,052 సీసీ రోడ్లు
పెద్దాపురం నియోజక వర్గంలో రూ.10 కోట్లతో నిర్మాణ పనుల జోరు
సామర్లకోట, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లకు మహా ర్దశ పట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయి. గ్రామాల్లో ఒక్క రోడ్డు నిర్మాణం కూడా చేపట్టలేదు. దీంతో గ్రామాల్లోని రహదారులు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ము రుగు కాలువల నిర్మాణాలు చేపట్టకపోవడంతో మురుగునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో మురికి కూపాలుగా మారాయి. కూటమి ప్రభుత్వం అధి కారంలోకి రాగానే సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకువచ్చారు. పల్లె పండుగ పేరుతో గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, సైడ్ కాలు వల నిర్మాణాలతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా సీసీ రోడ్ల నిర్మాణం జోరుగా సాగు తోంది. ఆర్థిక సంఘం నిధులు కూడా విడుదల కావడంతో అన్ని రకాల పనులూ చేపడుతున్నా రు. జిల్లాలో పంచాయతీరాజ్‌శాఖ ద్వారా జాతీ య ఉపాధి హామీ నిధులతో మొత్తం 1,052 అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో 145.11 కిలోమీటర్ల పొడవు గల సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.96.38 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటికే 53 కిలోమీటర్ల పొడవు గల 269 సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన సీసీ రోడ్ల నిర్మాణపు పనుల్లో దాదాపు 45 నుంచి 85 శాతం మేర పూర్తికాగా, పది రోజుల్లో 90 శాతం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని పంచాయతీ రాజ్ సూపరింటిండెంట్ ఇంజనీర్ మల్లిఖార్జున రావు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. దీంతో రానున్న కొత్త సంవత్సరంలో సంక్రాంతికి జిల్లాలో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండుగ రోడ్లు సం క్రాంతి శోభను తీసుకురానున్నాయి. కాగా పెద్దా పురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రత్యేక కృషి మేరకు రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయించడమేగాక 30 సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. వేట్లపాలెం, ఆనూరు, చదలాడ గ్రామాల్లో నాలుగు సీసీ రోడ్ల నిర్మా ణాలు పూర్తిచేయగా మిగిలిన 26 పనులు సుమారు 75 శాతం పూర్తయ్యి మిగిలిన పను లు జనవరి మొదటి వారానికి పూర్తికానున్నట్టు పంచాయతీరాజ్ పెద్దాపురం డివిజన్ సహాయ ఇంజనీరు కె.శ్రీనివాసరావు తెలిపారు. రెండవ విడత నిధులుగా మరో రూ.10 కోట్ల నిధులకు గాను 26 పనులకు రూ.4.15 కోట్ల మేర ఇటీవల విడుదల అయ్యాయన్నారు. ఈ నిధులతో కూడా సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించాల్సివుంది. గత వైసీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరుకాక ఆ పార్టీ సర్పంచ్‌లు కూడా అసహనం వ్యక్తం చేసేవారు. కూటమి ప్రభుత్వంలో పంచాయతీ ల్లోని రహదారులు, సైడ్ కాలువల పనులు జరు గుతుండడంతో తమ పదవీకాలం ముగిసేలోపు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని వైసీపీ సర్పంచ్‌లే హర్షం వ్యక్తంచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు మునుపెన్న డూలేని రీతిలో చకచకా జరుగుతుండడంతో కూ టమి ప్రభుత్వంలో ప్రజల కష్టాలు తొలగుతు న్నాయని గ్రామీణులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొ దటి అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేసేలా ఆయా ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం, జనసేన నాయకులకు బాధ్యతలు అప్పగించారు.