Share News

జిల్లాలో టెన్త్‌ ,ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:59 AM

జిల్లాలో వచ్చే నెలలో జరిగే టెన్త్‌ ,ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కే మాధవీలత తెలిపారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ప్రగతిని వివరించారు.

జిల్లాలో టెన్త్‌ ,ఇంటర్‌  పరీక్షలకు ఏర్పాట్లు

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 1: జిల్లాలో వచ్చే నెలలో జరిగే టెన్త్‌ ,ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కే మాధవీలత తెలిపారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ప్రగతిని వివరించారు. టెన్త్‌ , ఇంటర్‌ పరీక్షలపై వివరాలు వెల్లడించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి 137 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మొత్తం 23,681 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా వారిలో బాలలు 12,112, బాలికలు 11,516 మంది ఉన్నారని తెలిపారు. వీరిలో ఆంగ్ల మాధ్యమంలో 17,267 మంది, తెలుగు మాధ్యమంలో 6,414 మంది హాజరవుతారని తెలిపారు. గత ఏడాది 72 శాతం ఉత్తీర్ణత సాధించారని ఈ ఏడాది నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి జిల్లాలో 52 పరీక్ష కేంద్రాల ద్వారా 41,304 మంది హాజరుకానున్నారని వారిలో మొదటి ఏడాది 21,288 మంది ద్వితీయ సంవత్సరం 20,016 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఇంటర్మీడియెట్‌కి 37,502 మంది, ఒకేషనల్‌ కోర్సు విద్యార్థులు 3802 మంది ఉన్నారని తెలిపారు. జిల్లాలో రిజిస్ట్రేషన్‌ కోసం జిల్లాలో 57,918 ప్లాట్స్‌ మ్యాపింగ్‌ పూర్తి చేశామని, సుమారు 55 వేల ప్లాట్స్‌కు సరిహద్దులు గుర్తించినట్టు తెలిపారు.స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఉపాఽధి హామీ, జగనన్న ఆరోగ్య సురక్షల ప్రగతిపై వివరాలు వీడియోకాన్ఫరెన్స్‌లో వివరించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు, సీపీవో ఎల్‌ అప్పలకొండ, డ్వామా పీడీ ఏ.ముఖలింగం, డీఎంహె చ్‌వో డాక్టర్‌ కే.వెంకటేశ్వరరావు, డాక్టర్‌ సూర్యప్రభ, డాక్టన్‌ ఎన్‌.సనత్‌ కుమారి, డాక్టర్‌ పి.ప్రియాంక, డీపీవో జీవీ.సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:59 AM