Share News

కూటమిదే విజయం

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:09 AM

సార్వత్రిక ఎన్నికల్లో విజయం కూటమిదేనని జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. మంగళవారం రాత్రి పడమర, తూర్పు చోడవరాలు, గుండేపల్లి, తెలికిచర్ల గ్రామాల్లో వారు ప్రచారం ప్రారంభించారు.

కూటమిదే విజయం

  • 18న నామినేషన్‌ ప్రక్రియకు తరలిరావాలి

  • ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి, జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళపూడి

నల్లజర్ల, ఏప్రిల్‌ 16: సార్వత్రిక ఎన్నికల్లో విజయం కూటమిదేనని జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. మంగళవారం రాత్రి పడమర, తూర్పు చోడవరాలు, గుండేపల్లి, తెలికిచర్ల గ్రామాల్లో వారు ప్రచారం ప్రారంభించారు. ముందుగా పడమర చోడవరంలో సర్పంచ్‌ పెండ్యాల హిమబిందు, చందు ఇంటి వద్ద గ్రామ మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మద్దిపాటికి, ముళ్ళపూడికి హారతులిచ్చారు. గోవుకు పూజ చేసి ప్రచారం రథం ఎక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. అనంతరం తెలికిచర్లలో టీడీపీ మండల సర్వసభ్య సమావేశం జరిగింది.

  • నామినేషన్‌ దాఖలుకు తరలి రావాలి

ఈ నెల 18న గోపాలపురంలో వేసే నామినేషన్‌ ప్రక్రియకు నియోజక వర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, తరరావాలన్నారు. ముందుగా ద్వారకాతిరుమల వెంకన్న దర్శనం అనంతరం బైక్‌లు, కార్ల ర్యాలీగా నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం చేరుకుని అక్కడ నామినేషన్‌ అనంతరం విందు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు తాతిన సత్యనారాయరణ, జనసేన కన్వీనర్‌ దొడ్డిగర్ల సువర్ణరాజు, చోడసాని బాపిరాజు,కూచిపూడి ఉదయబాస్కర్‌, జమ్ముల సతీష్‌, యద్దనపూడి బ్రహ్మరాజు, పసుమర్తి రతీష్‌, రావూరి వెంకటరమణ, వల్లూరి సత్తిపండు, ఆలపాటి శ్రీరామూర్తి, బీజేపీ నాయకులు శెట్టిపల్లి శివనాగరాజు, చెల్లు సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:09 AM