Share News

యానాం వెంకన్న ఆలయానికి చేరుకున్న నల్ల రాళ్లు

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:28 AM

యానాం వెంకన్న ఆలయానికి చేరుకున్న నల్ల రాళ్లు

యానాం వెంకన్న ఆలయానికి చేరుకున్న నల్ల రాళ్లు

యానాం, డిసెంబరు 31: యానాం శ్రీభూసమేత వెంకటేశ్వరస్వార స్వామి ఆలయ పునఃనిర్మాణానికి సంబంధించి తమిళనాడులోని తిరుచ్చి నుంచి నల్లరాళ్లు యానాం చేరుకున్నాయి. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో యానాం వెంకన్న ఆలయం నిర్మాణ పనులు టీటీడీ చేపడుతున్న విషయం తెలిసింది. మొదటి దశలో రూ.6కోట్లతో పనులు ప్రారంభమ య్యాయి. రూ.2.7కోట్లు దాతలు సమకూర్చగా టీటీడీ రూ.3.30కోట్లు సమ కూర్చింది. తమిళనాడు చెందిన కాంట్రాక్టర్‌ టెండర్‌ దక్కించుకున్నాడు. కొన్ని నెలలుగా తిరుచ్చిలో నల్లరాయి పనులు చేపట్టారు. 40టన్నుల నల్లరాళ్లు ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణానికి చేరుకున్నాయి. పరిపాలనాధికారి ఆర్‌.మునిస్వామి, ఆలయ ఈవో ఖండవిల్లి రామకృష్ణ, ఆలయ కమిటీ ప్రతినిధులు కాపగంటి ఉమాశంకర్‌, మొలగజ్జెల ఆనందరావు, గుత్తుల గోవిందజయరామారావు, కొంకిపూడి గాంధీ, టీఎస్‌ రాజేశ్వరరావు, గూటం శివగణేష్‌, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నల్లరాయిలను ఆలయం ప్రాంగణంలో దించారు.

Updated Date - Jan 01 , 2024 | 06:58 AM