Share News

వెంకన్న ఆలయంలో పోటెత్తిన భక్తజనం

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:57 AM

కోనసీమ తిరుమల వాడపల్లి పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తజనం పోటెత్తారు. సుప్రభాత సేవ, ఐశ్యర్యలక్ష్మీ హోమం, బాలభోగం తదితర సేవలను నిర్వహించి స్వామివారిని పుష్పాలతో అలంకరించారు.

వెంకన్న ఆలయంలో పోటెత్తిన భక్తజనం

స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.30.13 లక్షలు

ఆత్రేయపురం, జనవరి 20: కోనసీమ తిరుమల వాడపల్లి పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తజనం పోటెత్తారు. సుప్రభాత సేవ, ఐశ్యర్యలక్ష్మీ హోమం, బాలభోగం తదితర సేవలను నిర్వహించి స్వామివారిని పుష్పాలతో అలంకరించారు. రాష్ట్రం తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు ఏడు ప్రదక్షిణలు నిర్వ హించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భారీ క్యూలైన్ల ద్వారా గోవిందనామస్మరణతో బారులుతీరి స్వామివారిని దర్శించారు. రాత్రి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిం చారు. వివిధ సేవల ద్వారా స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.30.13 లక్షలు లభించి నట్టు చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజులు తెలిపారు.

వీరేశ్వరుని 150 రోజుల ఆదాయం రూ. 24.90 లక్షలు

ఐ.పోలవరం, జనవరి 20: మురమళ్ల వీరేశ్వరస్వామి 150 రోజుల ఆదాయం రూ.24,90,665 వచ్చినట్టు ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. చైర్మన్‌ పెన్మెత్స వాసురాజు ఆధ్వర్యంలో తనిఖీదారు రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో శనివారం హూండీ ఆదాయం లెక్కించారు. తొలుత ఆలయ అర్చకులు హూండీకి హారతి ఇచ్చారు. ప్రధాన హూండీ ద్వారా రూ.12,38,089, నిత్యకల్యాణ కట్నకానుకల ద్వారా రూ.10,69,539, అన్నదాన హూండీ ద్వారా రూ.1,83,037 ఆదాయం సమకూరింది. గతంకంటే ఈసారి అదనంగా రూ.4,91,011 ఆదాయం వచ్చింది.

Updated Date - Jan 21 , 2024 | 12:57 AM