Share News

మళ్లీ పెరుగుతున్నాయ్‌..

ABN , Publish Date - May 21 , 2024 | 01:03 AM

సామర్లకోట, మే 20: కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా పచ్చిమిర్చి ధర కిలో రూ. 100కు చేరడం సామాన్య ప్రజల్లో ఆం దోళన కలిగిస్తోంది. వారం రోజుల వ్యవ ధిలోనే ధరల పెరుగుదలలో మార్పు కనిపిస్తోంది. వేసవి కావడం, డిమాం డ్‌కు అనుగుణంగా కూరగాయల దిగు బడులు లేకపో

మళ్లీ పెరుగుతున్నాయ్‌..

కూరగాయల ధరలకు రెక్కలు

దిగుబడులు లేకే పెరుగుదల

సామర్లకోట, మే 20: కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా పచ్చిమిర్చి ధర కిలో రూ. 100కు చేరడం సామాన్య ప్రజల్లో ఆం దోళన కలిగిస్తోంది. వారం రోజుల వ్యవ ధిలోనే ధరల పెరుగుదలలో మార్పు కనిపిస్తోంది. వేసవి కావడం, డిమాం డ్‌కు అనుగుణంగా కూరగాయల దిగు బడులు లేకపోవడమే ధరల పెరుగు దలకు ప్రధాన కారణం అని కూరగా యల వ్యాపారి స్వామి తెలిపారు. మొన్నటి వరకూ పచ్చిమిర్చి కిలో రూ.40 నుంచి రూ.50 ఉండగా ఆదివారం సామర్లకోట, పెద్దాపురం మార్కెట్లలో రూ. 80కు చేరింది. ఇక బెండకాయలు, దొండకాయలు, బంగాళా దుంపలు, గోరు చిక్కుళ్ళు కిలో రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.60కు చేరాయి. బీరకాయలు కిలో రూ.40 నుంచి రూ.80కు చేరాయి. వంకాయలు కిలో రూ.30 నుంచి రూ.50కు చేరాయి. నల్లవంకాయలు కిలో రూ.40 నుంచి రూ.60కు పెరిగాయి. దోసకాయలు కిలో రూ.30 ఉండగా ఆదివారం నాటి ధర రూ.40కు చేరింది. ఇక బీన్స్‌ మొన్నటి వరకూ కిలో రూ. 100 నుంచి రూ. 120లు ఉండగా ఆదివారం రూ.200కు చేరింది. ఇక బీట్‌రూట్‌, క్యారెట్‌ ధరల్లో కిలోకు రూ.20 చొప్పున పెరిగాయి. టమోటా కిలో రూ.20కు విక్రయాలు జరుగగా ప్రస్తుతం కిలో రూ.40కు చేరింది. కాప్సికం కిలో రూ.70 నుంచి ఏకంగా రూ.100కు చేరింది. ఉల్లిపాయలు కిలో రూ.20 నుంచి రూ.30కు చేరాయి. వెల్లుల్లి కిలో రూ.180 నుంచి రూ.220కు చేరాయి. చిలకడ దుంపలు కిలో రూ.60కు పెరగగా కాకరకాయలు కిలో రూ. 50కు పెరిగాయి. కంద కిలో రూ.40 నుంచి రూ.60కు పెరిగాయి. అయినప్పటికీ ఆయా కూరగాయలు నాసిరకంగా ఉంటున్నాయని కొనుగోలుదారుల నుంచి వినిపిస్తోంది. ఇదే రీతిలో ఆకుకూరల ధరలు కూడా అమాంతంగా పెరిగాయి.

Updated Date - May 21 , 2024 | 01:03 AM