హైందవ సనాతన ధర్మవ్యాప్తికి గాడ్ కృషి అభినందనీయం
ABN , Publish Date - Jan 20 , 2024 | 01:48 AM
హైందవ సనాతన ధర్మవ్యాప్తికి గాడ్ కృషి అభినందనీయం
టీటీడీ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు
రాయవరం, జనవరి 19: హైందవ సనాతన ధర్మవ్యాప్తికి వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి గాడ్ చేస్తున్న కృషి అభినందనీయమని టీటీడీ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు అన్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవ రం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి 88వ జన్మదిన వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ప్రసార భారతీ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.అనంత పద్మనాభరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో వేణుగోపాల దీక్షితులు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, సాగరఘోష కవి గరికపాటి నరసింహారావు, మహామహోపాధ్యాయ విశ్వనాఽథ గోపాలకృష్ణ, యర్రప్రగడ రామకృష్ణ తదితరులు మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణకు పీఠాధిపతులు, మఠాధిపతులు చేస్తున్న సేవలను కొనియాడడంతోపాటు మనిషి ధర్మపథంలో ఎలా నడవాలనేది రాముడు మనకు చూపాడన్నారు. అయోధ్యలో సీతారాముల ప్రతిష్ఠ సందర్భంగా రాముడి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలన్నారు. పీఠాధిపతి గాడ్ భక్తులనుద్దేశించి ప్రసంగం చేస్తూ ప్రతి మనిషి దైవారాధన చేయడం ద్వారానే మానసిక ప్రశాంతత లభించడంతోపాటు చింతలు తొలగుతాయన్నారు. విజయదుర్గా విశిష్ట సేవా పురస్కారాన్ని అనపర్తికి చెందిన ప్రముఖ నేత్ర వైద్యుడు తేతలి సత్యనారాయణరెడ్డి, మస్తానమ్మ దంపతులకు అందజేశారు. పీఠాధిపతి గాడ్‌కు తిరుమల, కాశీ, అన్నవరం దేవస్థానాల నుంచి తీసువచ్చిన ప్రసాదాన్ని అందజేసి వేదాశీస్సులు వేదపండితులు అం దజేశారు. ప్రముఖ వస్త్రవ్యాపారి తుమ్మిడి రామ్‌కుమార్, జీఎస్‌ఎల్ అధినేత గన్ని భాస్కరరావు, వారణాశి శృంగేరి శంకరమఠం మేనేజర్ చల్లా అన్నపూర్ణప్రసాద్, వారణాశికి చెందిన ఆధ్యాత్మికవేత్త చల్లా జగన్నాథ శాస్త్రి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.