Share News

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:46 AM

పి.గన్నవరం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు నైతిక విలువలతో ఉన్నత శిఖరాలు అ ధిరోహించాలని విశ్రాంత జిల్లా ఉపవిద్యా శాఖాధికారి మైలవరపు రవీం

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
ప్రతిభా పురస్కారాలు అందుకుంటున్న విద్యార్థులు

మానేపల్లి హైస్కూల్లో వక్కలంక రామారావు ప్రతిభా పురస్కారాల పంపిణీ

పి.గన్నవరం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు నైతిక విలువలతో ఉన్నత శిఖరాలు అ ధిరోహించాలని విశ్రాంత జిల్లా ఉపవిద్యా శాఖాధికారి మైలవరపు రవీంద్రనాథ్‌ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అం బేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మా నేపల్లి బాలుర జిల్లా పరిషత్‌ పాఠశాలలో సోమ వారం వక్కలంక రామారావు ప్రతిభా పురస్కారాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి ప్రధానోపాధ్యాయు డు కె.వెంకటసూర్యనారాయణమూర్తి అధ్యక్షత వహిం చగా రవీంద్రనాథ్‌ మాట్లాడారు. మానేపల్లి హైస్కూ ల్లో వక్కలంక రామారావు ఉపాధ్యాయుడిగా సుదీ ర్ఘకాలం పనిచేశారని, ఆయనకు ఈ ప్రాంతంతో విడదీయరాని బంధం ఉందన్నారు. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం నాకు కూడా ఉందని పాత జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకు న్నారు. మానేపల్లి హైస్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు నేడు వివిధ రంగా ల్లో, వివిధ హోదాల్లో పనిచేస్తున్నార న్నారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి విద్యలో ఉత్తమ ఫలితాలు సాధిం చేందుకే పాఠశాల పూర్వ విద్యార్థులైన రామారావు తనయులు గత ఎనిమి దేళ్లుగా ఈ ప్రతిభా పురస్కారాలు అం దిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఏడో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందిస్తున్నారని ఆయన చెప్పారు. అలాగే బాలుర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గాలిదేవర శ్రీనివాసరావు, బాలికల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపా ధ్యాయుడు కె.వి.సూర్యనారాయణమూర్తి మాట్లాడు తూ వక్కలంక రామారావు ప్రతిభా పురస్కారాలు ప్రతి ఏడాది విద్యార్థులకు ఆయన తనయులు అంది ంచడం అభినందనీయమన్నారు. 2023-24 విద్యాసం వత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలుర పాఠశాల విద్యార్థి గోగు వెస్లేరాజు, బాలికల పాఠశాల విద్యార్థిని మోకా రక్షితకు రూ.5వేలు చొప్పున అందజే శారు. కార్యక్రమంలో హైస్కూలు చైర్మన్లు జోగి కుమా రకృష్ణ, కొమ్ముల రమాదేవి, విద్యార్థుల తల్లిదండ్రులు గోగు దేవరాజు, మోకా సూర్యకుమారి పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:46 AM