Share News

వాడపల్లిలో ఘనంగా సదస్యం

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:54 AM

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం స్వామివారి మేల్కొలుపు, నిత్యార్చన, హోమాలు, దిగ్దేవతా బలిహరణ, ద్రవిడవేద పారాయణం లను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

వాడపల్లిలో ఘనంగా సదస్యం

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 21: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం స్వామివారి మేల్కొలుపు, నిత్యార్చన, హోమాలు, దిగ్దేవతా బలిహరణ, ద్రవిడవేద పారాయణం లను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం విశ్వక్సేన పూజ, అష్టదిక్పాలక ఆరాధన, సదస్యం కన్నుల పండువగా జరిగాయి. వసంత మండపంలో స్వామివారికి చతుర్వేద పండితులు మహాదాశీర్వచనం ఇచ్చారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఖండవిల్లి రాజేంద్రవరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు, అర్చకులు కల్యాణోత్సవ పూజలు నిర్వహించారు. స్వామివారికి పట్టువస్త్రాలను ఈవో భూపతిరాజు కిషోర్‌కుమార్‌ సమర్పించారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఎంతగా నో ఆకట్టుకున్నాయి. మహిళల కోలాటం అలరించింది.

Updated Date - Apr 22 , 2024 | 12:54 AM