కూలి డబ్బులు..బొక్కుడు!
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:31 AM
ఉపాధి హామీ పథకంలో తవ్వుతున్న కొద్దీ అవినీతి,అక్రమాలు బయటపడుతూనే ఉన్నా యి. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి పనుల్లోకి రాని వారికి,ఊళ్లో లేనివారికి..బంధువులకు బినామీ మస్తర్లు, దొంగ మస్తర్లు నమోదు చేస్తూ భారీస్థాయిలో దో చేస్తున్నారు.

మస్తర్ల మాయాజాలం
ఎఫ్‌ఏల ఇష్టారాజ్యం
బంధువుల పేరున హాజరు
కొరవడుతున్న పర్యవేక్షణ
తూతూ మంత్రంగా తనిఖీలు
అనపర్తిలో ఘటనే నిదర్శనం
రాజానగరంలోనూ ఇంతే..
కడియంలోనూ మింగేశారు
రాజానగరం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పథకంలో తవ్వుతున్న కొద్దీ అవినీతి,అక్రమాలు బయటపడుతూనే ఉన్నా యి. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి పనుల్లోకి రాని వారికి,ఊళ్లో లేనివారికి..బంధువులకు బినామీ మస్తర్లు, దొంగ మస్తర్లు నమోదు చేస్తూ భారీస్థాయిలో దో చేస్తున్నారు. జిల్లాలో మొన్న ముక్కినాడ,నిన్న నరేంద్రపురం, నేడు కడి యం, అనపర్తి ఇలా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.అధికారులే బిత్తరపోయేలా ఉపా ధి దోపిడీలు బయట పడుతున్నాయి. ఉపాధి పనులకు సంబంధించి సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నా అధికారుల కళ్లుకప్పి బయటప డుతున్నారా? లేక తనిఖీల సమయంలో సం బంధిత అధికారులకు మా మూళ్లు సమర్పిం చి ప్రసన్నం చేసుకుంటున్నారో అర్ధం కాని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే సామాజిక తనిఖీల్లో మాత్రం అంతా సక్రమం గానే జరుగుతున్నట్లుగా రికార్డులు చూపి స్తు న్నారు.అక్రమాలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్ల పేర్లు బహిర్గతం చేయకపోవడం, ఏవిధమైన చర్యల్లేకపోవడం అనుమానాలను తావిస్తోంది.
హండ్రెడ్ పర్సెంట్ దోపిడీ..
ఉపాధి హామీ పథకం పక్కదారి పడు తోంది.జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్లు చెప్పిందే వేదం అన్నట్టుగా సాగుతుంది. మండల స్థాయి అధికారులు వారికే భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో ఇష్టా నుసారం చేస్తున్నారు. ఉపాధి పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దోపిడీకి పాల్పడుతున్నారు. రాజానగరం , కడియం, అనపర్తి మండలాల్లో జరిగిన ఘటనలే దీనికి నిదర్శనం. రాజాన గరం మండలంలో జరుగుతున్న ఉపాధి పనుల్లో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయట పడుతూనే ఉన్నాయి. జాబ్ కార్డు పొందిన కుటుంబాలకు వంద రోజులు పనిదినాలు కల్పించాల్సి ఉండగా కేవలం వారం, పది రోజులు మాత్రమే వారితో పనులు చేయిస్తు న్నారు.ఆ తరువాత ఫీల్డ్ అసి స్టెంట్లు బినామీ, దొంగ మస్తుర్లు నమోదు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు.సోషల్ ఆడిట్ తని ఖీలు నిర్వహించి నామమాత్రంగానే అవినీతి జరిగినట్టు తేల్చి మిన్నకుండిపోతు న్నారు.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
రాజానగరం మండలంలో మస్తర్ల మాయా జాలంలో ముక్కినాడ ఉపాధి హామీ ఫీల్డ్ అసి స్టెంట్ కవల సాయి గిరిధర్‌ను ఉన్నతాధికా రులు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈయన గత కొన్నేళ్లుగా గ్రామంలో లేనివా రితో పాటుగా అసలు ఉపాధి పనుల్లోకి రాని వారికి దొంగ మస్తర్లు, బినామీ మస్తర్లు నమో దు చేస్తూ ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు అధికారులు విచారణలో నిర్ధార ణ కావడంతో ఉన్నతాధికారులు విధుల నుం చి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంఘ టన విధితమే. సాయి గిరిధర్ విచారణ అనంతరం అనేక ఆరోపణలు వినిపిస్తున్నా యి.ఫీల్డ్ అసిస్టెంట్ సాయి గిరిధర్ గ్రామానికి చెందిన జనసైనికుల్లో ఒకరికి నెల నెలా రూ.50 వేలు వంతున ముట్టజెప్పేం దుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు గ్రామస్తులు ఆరో పిస్తున్నారు. దీని మూలంగా దొంగ మస్తర్లు, బినామీ మస్తర్లు నమోదు చేస్తున్నట్టు చెబు తున్నారు. రాజానగరం మండలంలో ఇటు వంటి వారు చాలా మంది ఉన్నారు. ఇక దివాన్‌చెరువు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా పని చేస్తూ ఉపాధి కార్యాలయ ఉద్యోగులను గుప్పెట్లో పెట్టు కుని బెదిరింపులకు పాల్పతూ అందరిపై పెత్తనం చెలాయించేవాడని కొంత మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. దివాన్‌చెరువు గ్రామంలో ప్రభుత్వ ఏ కాంట్రాక్టు అయినా ఈయనే చేయాలి. ఒకవేళ కాదంటే సంబంధిత అధికారి బదిలీ, డిప్యు టేషన్‌పై గానీ వెళ్లిపోవాల్సిందేనట. దీంతో అధికా రులు సైతం సదరు ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవహార శైలిని పసిగట్టినప్పటికీ ఏమీ చేయలేని నిస్స హాయ స్థితిలో కాలం వెళ్లదీస్తూ వచ్చారని సంబంధిత ఉద్యోగుల వాపోతున్నారు. అప్పటి ఎమ్మెల్యేను అడ్డం పెట్టుకుని దివాన్ చెరువు గ్రామ పరిధిలో చేపట్టిన ఉపాధి పనుల్లో అంతులేని దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది.దివాన్‌చెరువు ఫీల్డ్ అసిస్టెంట్ పని తీరుపై అక్టోబరు నెలలో డ్వామా పీడీ కార్యా లయం నుంచి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. దీనిపై సదరు ఫీల్డ్ అసిస్టెంట్‌ను విచారించాల్సి ఉండగా నేటికి కూడా పట్టిం చుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.నరేంద్రపురంలో వెలుగు చూసిన అక్రమాలపై డ్వామా ప్రాజెక్టు కార్యాలయం నుంచి విచారణకు ఆదేశించారు.దీనిలో భాగం గా దాదాసు 30 మంది వరకు ఉపాధి హామీలో పనిచేసిన వేతనదారులను విచారిం చాలని గ్రామస్తులు అధికారులకు నివేదించా రు. ఇప్పటికే విచారణ చేపట్టి సదరు ఫీల్డ్ అసిస్టెంట్ అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకోవాల్సి ఉంది.అయితే సంబంధిత విచార ణాధికారులు నేటికి కూడా ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.మరో వైపు ఇటీవల కడి యం, అనపర్తి మండలాల్లో ఫీల్డ్ అసి స్టెంట్లు అవినీతికి పాల్పడి సామాజిక తనిఖీ ల్లో అడ్డంగా దొరికిపోయారు.అనపర్తి మండ లంలో అయితే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏకంగా తల్లీ..అన్ననే కూలీలుగా చేర్చుకుని మస్తర్లు వేసి నిధులు పక్కదారి పట్టించడంపై అధికా రులే విస్తపోయారు. జిల్లాలో మరింత లోతు గా విచారణ జరిపితే కోట్లాది రూపా యల అవినీతి బయటపడే అవకాశం ఉం టు ంది. ఈ మేరకు ఉన్నతాధికారులు దృష్టిసారించాలి.