Share News

ఇద్దరు ఇంటి దొంగల సస్పెన్షన్‌

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:55 AM

రంపచోడవరం అటవీశాఖ డివిజన్‌ పరిధిలో రంపచోడవరం, మారేడుమిల్లి రేంజ్‌ల పరిధిలో టేక్‌ ప్లాంటేషన్లలో 400కు పైగా టేకు చెట్లను నరికేసిన అక్రమ భాగోతంలో ఒక డిప్యూటీ రేంజ్‌ అధికారిని, మరొక ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేస్తూ అటవీశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

ఇద్దరు ఇంటి దొంగల సస్పెన్షన్‌

టేకు చెట్ల గల్లంతు బాగోతంలో ప్రాఽథమిక చర్యలు

మరికొందరిపై చర్యలకు రంగం సిద్ధం

డివిజన్‌స్థాయి నుంచి బీట్‌ స్థాయి వరకు జల్లెడపట్టే పనిలో దర్యాప్తు బృందాలు

రంపచోడవరం, మార్చి 26: రంపచోడవరం అటవీశాఖ డివిజన్‌ పరిధిలో రంపచోడవరం, మారేడుమిల్లి రేంజ్‌ల పరిధిలో టేక్‌ ప్లాంటేషన్లలో 400కు పైగా టేకు చెట్లను నరికేసిన అక్రమ భాగోతంలో ఒక డిప్యూటీ రేంజ్‌ అధికారిని, మరొక ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేస్తూ అటవీశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఈ పై ఇద్దరి పాత్ర ఆధారాలతో రుజువు కావడంతో వారిపై తక్షణ చర్యలు తీసుకున్నారు. ఇదే భాగోతంలో మరి కొందరిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా సమగ్ర దర్యాప్తును రాజమహేంద్రవరంలోని అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ పర్యవేక్షణలో ఆరు బృందాలను నియమించించిన సంగతి తెలిసిందే. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డివిజన్‌స్థాయి నుంచి బీట్‌ స్థాయి వరకు అందరి అధికారులు తమ సిబ్బంది సెల్‌ఫోన్లను కూడా జల్లెడపట్టే పనిలో దర్యాప్తు బృందాలు నిమగ్నమయ్యాయి.

Updated Date - Mar 27 , 2024 | 12:55 AM