Share News

విజయదుర్గా పీఠాన్ని సందర్శించిన టీటీడీ ప్రధాన అర్చకుడు

ABN , Publish Date - Dec 29 , 2024 | 01:07 AM

రాయవరం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వెదురుపాక విజయదుర్గా పీఠాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు శనివారం సందర్శించారు. విజయదుర్గా అమ్మవారికి అర్చనలు, హారతులు నిర్వహించి పీఠాధిపతి గాడ్‌ ఆశీస్సులు పొందారు. తిరుమల నుంచి తీసుకువ

విజయదుర్గా పీఠాన్ని సందర్శించిన టీటీడీ ప్రధాన అర్చకుడు
విజయదుర్గాకు పూజలు చేస్తున్న టీటీడీ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు

రాయవరం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వెదురుపాక విజయదుర్గా పీఠాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు శనివారం సందర్శించారు. విజయదుర్గా అమ్మవారికి అర్చనలు, హారతులు నిర్వహించి పీఠాధిపతి గాడ్‌ ఆశీస్సులు పొందారు. తిరుమల నుంచి తీసుకువచ్చిన శ్రీవారి ప్రసాదాలు, లడ్డూలు గాడ్‌కు అంద జేసి గాడ్‌ను శ్రీవారి శేషవస్త్రంతో వేణుగోపాల దీక్షితులు సత్కరించారు. అనంతరం పీఠంలో జరుగుతున్న పవిత్రోత్సావాలను ఆయన కొద్ది సేపు తిలకించారు. విజయదుర్గా పీఠంలో తిరుపతి వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయదుర్గాదేవి, విజయ వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. వైఖానస పండితులు సాయి బృందం ఆధ్వర్యంలో విజయదుర్గా అమ్మవారికి అర్చ నలు, స్వామివారికి అమ్మవార్లకు అర్చనలు, హోమం పూర్ణాముతి నిర్వహించారు. పీఠాధిపతి గాడ్‌ పవిత్రోత్సవాలు విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం అర్చకులు స్వా మి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు.

Updated Date - Dec 29 , 2024 | 01:07 AM