Share News

శస్త్ర చికిత్సా విధానంలో ఫ్యూజ్‌ కీలకం

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:52 AM

శస్త్ర చికిత్సా విధానంలో ఫండమెంట్‌ యూజ్‌ ఆఫ్‌ సర్జికల్‌ ఎనర్జీ (ఫ్యూజ్‌)ఎంతో కీలకమని ప్రఖ్యాత అమెరికా వైద్య నిపుణుడు డాక్టర్‌ జైసా ఓలాస్కీ అన్నారు.

శస్త్ర చికిత్సా విధానంలో ఫ్యూజ్‌ కీలకం

జీఎస్‌ఎల్‌లో ఘనంగా ప్రారంభమైన వర్కుషాపు

రాజానగరం, జూన్‌ 7: శస్త్ర చికిత్సా విధానంలో ఫండమెంట్‌ యూజ్‌ ఆఫ్‌ సర్జికల్‌ ఎనర్జీ (ఫ్యూజ్‌)ఎంతో కీలకమని ప్రఖ్యాత అమెరికా వైద్య నిపుణుడు డాక్టర్‌ జైసా ఓలాస్కీ అన్నారు. రాజా నగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల, అమెరికా గాస్ట్రో ఇంటెస్టినల్‌, ఎండోస్కోపిక్‌ సర్జన్ల సొసైటీ(ఎస్‌ఏజీఈఎస్‌) సంయుక్తంగా జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాలలో రెండురోజుల పాటు నిర్వహించనున్న ఫ్యూజ్‌ వర్క్‌షాప్‌ శుక్రవారం ఽఘనంగా ప్రారంభ మైంది. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్‌ జైసా ఓలాస్కీ మాట్లాడుతూ శస్త్రచికిత్సా పరికరాలను సమర్థవంతంగా ఉపయో గించడంలో సాధన అవసరమన్నారు. రోగులకు నిర్వహించే శస్త్ర చికిత్సల్లో ఫ్యూజ్‌ విధానం వినియోగాన్ని వివరించారు. మరో ముఖ్యఅతిథి న్యూయార్క్‌కు చెందిన డాక్టర్‌ జాకబ్స్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, ప్రొఫెసర్‌ ప్యూజ్‌ కోర్సు స్థాపకుడు డాక్టర్‌ స్టీవెన్‌ షైట్జ్‌బర్గ్‌ మాట్లాడుతూ ప్యూజ్‌ కోర్సును వినియోగించుకుని రోగుల భద్రత, శస్త్రచికిత్స పనితనం మెరుగుపర్చు కోవాలన్నారు. ఈ వర్క్‌షాప్‌ ద్వారా నైపుణ్యాలను, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నూతన కోర్సు మూలాలు, ప్రయోజనాలను వివ రించారు. మరోఅతిథి సట్టర్‌ ఈస్ట్‌ బే మెడికల్‌ గ్రూప్‌, సాన్‌ ఫ్రా న్సిస్కో జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ పాస్కల్‌ పుచ్‌షుబెర్‌, యూనివర్శిటీ ఆఫ్‌ కొలరెడో హాస్పిటల్‌, డెన్వర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ సర్జరీ వైద్యులు ఎడ్వర్జ్‌ జోన్స్‌, స్టోనీ బ్రూక్‌ యూనివర్శిటీ హాస్పి టల్‌ (న్యూయార్క్‌) జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ కింగా పవర్స్‌ తదితర సీనియర్‌ సర్జన్లు ఫ్యూజ్‌ కోర్సు ప్రాముఖ్యతను వివరించారు. జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాలలో కల్పించిన ఆధునిక సిమ్యులేటర్‌ పరికరాలు వైద్య విద్యార్థులకు ఎంతగానో దోహపడతా యన్నారు. దీనిపై జీఎస్‌ఎల్‌ వైద్య విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ గన్ని భాస్కరరావు తమ సంస్థలో నిర్వహించే వివిఽధ శస్త్ర చికిత్సా పరిక రాలు, శస్త్ర చికిత్సా ఫలితాలను మెరుగుపర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని వివరించారు. రెండు రోజులపాటు జరుగనున్న ఫ్యూజ్‌ వర్క్‌షాప్‌ను ముఖ్యఅతిథి డాక్టర్‌ జైసా ఓలాస్కీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అతిథులను జీఎస్‌ఎల్‌ యాజమాన్యం ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేసింది.

Updated Date - Jun 08 , 2024 | 12:52 AM