Share News

ప్రయాణ..ప్రయాస!

ABN , Publish Date - Jan 21 , 2024 | 11:44 PM

సం క్రాంతి పండుగ సందడి ముగిసింది.. గత బుధవారం ముక్కనుమతో సంక్రాంతి పండుగ ముగిసింది. అయితే గురువారం అందరూ తిరుగుముఖం పడదామనుకునే లోపునే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల సెలవులను 21వ తేదీ వరకూ పొడిగించింది. దీంతో ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు. ఆదివారంతో సెలవులు ముగియడంతో అంతా సొంతాళ్లకు పయనమయ్యారు.

ప్రయాణ..ప్రయాస!
రాజమహేంద్రవరంలో రైలు ఎక్కడానికి కూడా ఖాళీ లేని వైనం

ముగిసిన సంక్రాంతి సెలవులు

ఊళ్లకు పయనమైన జనం

రైళ్లలో బాత్‌రూమ్‌లు ఖాళీలేవ్‌

ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం

నేడు రద్దీ ఉంటుందని సమాచారం

రాజమహేంద్రవరం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): సం క్రాంతి పండుగ సందడి ముగిసింది.. గత బుధవారం ముక్కనుమతో సంక్రాంతి పండుగ ముగిసింది. అయితే గురువారం అందరూ తిరుగుముఖం పడదామనుకునే లోపునే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల సెలవులను 21వ తేదీ వరకూ పొడిగించింది. దీంతో ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు. ఆదివారంతో సెలవులు ముగియడంతో అంతా సొంతాళ్లకు పయనమయ్యారు. దీంతో తిరుగు ప్ర యాణాల రద్దీ ఎక్కువైంది. రైళ్లన్నీ కిక్కిరిసి నడుస్తు న్నాయి. పశ్చిమబంగ్లా, అసోం వైపు నుంచి వచ్చే రైళ్లలో కాలు పెట్టడానికి వీల్లేకుండా బోగీలన్నీ పూర్తిగా నిండి పోయాయి. జనరల్‌, రిజర్వేషను బోగీల్లో సామర్థ్యానికి మించి మూడింతల ప్రయాణికులు ఉంటున్నారు. దీంతో ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. రిజర్వేషను బోగీల్లో ఒక కూపేకు ఎనిమిది మందికి సీట్లు/బెర్తులు కేటాయిస్తారు. కానీ ఒక్కో కూపేలో తక్కువంటే 20 మంది ప్రయాణికులు ఉంటున్నారు. దీనికి సంబంధించి రైల్‌ మదద్‌కి రోజూ ఎక్కువగా ఫిర్యాదులు అందుతు న్నాయి. ఆహార పదార్థాల తర్వాత స్థానంలో ఈ ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్పీఎఫ్‌ పోలీసులు, టీటీఈలు బోగీ వద్దకు వెళ్లి క్లియర్‌ చేయిం చినా రైలు బయలుదేరగానే మళ్లీ పరిస్థితి మొదటికి వస్తోంది. రిజర్వేషను బోగీల్లో టిక్కెట్లు చెక్‌ చేయడానికి టీటీఈలకు నరకం కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధా రణంగా సిల్చార్‌, సిల్హాట్‌, గువాహటి వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఎప్పుడూ విపరీతమైన రద్దీతో నడుస్తుంటాయి.ఇప్పుడు పండుగ తిరుగు ప్రయా ణాల సందర్భంగా బోగీలు పూర్తిగా నిండిపోతు న్నాయి. ప్రమాదకరం అని తెలిసినా బోగీ ద్వారాలకు వేలాడుతూ మరీ ప్రయాణించాల్సి వస్తోంది. మహిళలు ఇలానే ప్రయాణిస్తున్నారు.రాత్రి వేళల్లో రైలు వెళ్తున్న సమయంలో హోరున వీచే చలికి ద్వారాల వద్ద ప్రయా ణికుల చేతుల్లో స్పర్శ నెమ్మదించి పట్టుకోల్పోయి ప్రమా దాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకసారి బోగీలో నికి వెళ్తే దిగేవరకూ కాలు కదపడానికి నానా తంటాలూ పడుతున్నారు. దిగే సమయంలో కూడా నరకం చూస్తు న్నారు.బాత్‌రూమ్‌లలో కూడా ప్రయాణికులు ఉంటున్నా రంటే రైలు ప్రయాణం ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా తిరుగు ప్రయాణాలు విజయవాడ, బెంగ ళూరు,చెన్నై, హైదరాబాద్‌, వైజాగ్‌, భువనేశ్వర్‌కి ఉంటా యి. ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లు లేకపోవడం, రద్దీని గమనించి రైళ్లు నడపలేకపోవడంతో దగ్గరి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నలిగిపోతున్నారు. దగ్గరి ప్రాంతాల ప్రయాణకుల డిమాండ్‌ ఎక్కువగా ఉండే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లనూ రద్దు చేయడం ప్రయాణికులకు మరింత ముప్పుగా మారింది. విజయవాడ, తాడేపల్లిగూ డెం, ఏలూరు, నూజివీడు, తుని, సామర్లకోట, విశాఖ వెళ్లే ప్రయాణికులు ఏ రైలు ఎక్కాలో అర్థంకాని పరిస్థితుల్లో ఏదోక రైలు ఎక్కి బతుకుజీవుడా అంటూ గమ్యస్థానంలో దిగుతున్నారు. సుదూర ప్రాంతాలను కలిపే రైళ్లలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వరకూ రిజర్వేషను చేయించు కున్న ప్రయాణికులు ఆ బోగీలు ఎక్కలేక.. జన్మభూమి వంటి ఇంటర్‌సిటీల్లో కాలు పెట్టడానికీ వీలులేక తీవ్ర మైన ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. రద్దీ కొనసాగుతున్నా ఉన్న రైళ్లనూ రద్దు చేస్తుండడంపై ప్రయాణికులు తీవ్రం గా మండిపడుతున్నారు.రైల్వే అధికారులు సాంకేతిక తది తర కారణాలు చూపడం ఇటీవల కాలంలో షరా మా మూలే అయినా తమతో ప్రయాణిస్తే ప్రయాణ హింస ఏమిటో అర్థం అవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. తిరుగు ప్రయాణికుల వల్ల రాజమండ్రి రైల్వే స్టేషను ద్వారా బాగానే ఆదాయం సమకూరింది. సాధా రణ రోజుల్లో 3 నుంచి 4 వేల మంది సాధారణ టిక్కెట్లు కొనుగోలు చేసి ప్రయాణిస్తుంటారు.ఈ ఐదు రోజుల్లో ఆ సంఖ్య పది వేలకు చేరగా రోజుకు ఆదాయం సరాసరి రూ.12లక్షలు దాటింది. రిజర్వేషను ప్రయాణికులను కలు పుకొంటే రోజుకు రాకపోకలు సాగించే వారి సంఖ్య 20 వేల వరకూ ఉంది. బస్టాండ్‌ కూడా కిటకిటలాడింది. బస్‌ ఎక్కడానికి కూడా ఖాళీ లేకుండా ఉంది. ప్రయాణి కులతో ఉదయం నుంచి బస్టాండ్‌ కిటకిటలాడింది. సోమవారం కూడా రద్దీ ఉంటుందని ఆర్టీసీ జిల్లా అధికా రులు చెబుతున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 11:44 PM