Share News

ట్రాఫిక్‌ ఎస్‌ఐపై దాడి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:26 AM

కాకినాడ జిల్లా కరప మండలం ఉప్ప లంకలో గురువారం సాయ ంత్రం మందు బాబులు విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కరప పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాకినాడ ట్రాఫిక్‌ ఎస్‌ఐ సీహెచ్‌.కిషోర్‌కుమార్‌ యా నాం జాతీయ రహదారిపై ఉప్ప లంక వద్ద డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేస్తున్నారు.

ట్రాఫిక్‌ ఎస్‌ఐపై దాడి

కరప, మార్చి 28: కాకినాడ జిల్లా కరప మండలం ఉప్ప లంకలో గురువారం సాయ ంత్రం మందు బాబులు విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కరప పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాకినాడ ట్రాఫిక్‌ ఎస్‌ఐ సీహెచ్‌.కిషోర్‌కుమార్‌ యా నాం జాతీయ రహదారిపై ఉప్ప లంక వద్ద డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేస్తున్నారు. ఆ సమయంలో మోటర్‌సైకిల్‌పై అటుగా వెళ్తున్న పాలెపు రాజు అనే వ్యక్తిని ఆపి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ నిర్వహించారు. అయితే బైక్‌ వెనుక ఉన్న అతని బావమరిది కర్రి కేశవ మద్యం మత్తులో ట్రాఫిక్‌ ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగాడు. తన బావ రాజు మద్యం సేవించలేదని, ఖైనీ ప్యాకెట్‌ వేసుకుంటే మందు తాగినట్టు మిషన్‌ తప్పుగా చూపిస్తుందని ఎదురు తిరిగాడు. పూటుగా మద్యం సేవించి ఉన్మాద స్థితిలో ఉన్న కేశవ తన వొంటిపై ఉన్న చొక్కాను విప్పేసి పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఊగిపోయాడు. పక్కనే దొరికిన పింగాణీ ముక్కను చేతిలోకి తీసుకుని దగ్గరికి వస్తే పీక కోసుకుంటానంటూ బెదిరించాడు. ఈ క్రమంలో పింగాణీ ముక్కతో ఎస్‌ఐపై దాడిచేశాడు. ఈ దాడిలో కిషోర్‌కుమార్‌ చెంపపై గాయమై తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఈ హఠాత్పరిణామంతో భీతిల్లిన ట్రాఫిక్‌ సిబ్బంది అతికష్టంపై నిందితులను అదుపులోకి తీసుకుని కరప పోలీసులకు అప్పగించారు. నిందితుడు కర్రి కేశవ ఉప్పలంక గ్రామానికి చెందినవాడు కాగా ప్రస్తుతం పగడాలపేటలో ఉంటూ కాకినాడ ఫిషింగ్‌హార్బర్‌లో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతని బావ పాలెపు రాజుది అమలాపురం మండలం మాసంగితిప్ప శివారు బ్రహ్మసమాజం అని, అతను కూడా కాకినాడలో ఉంటున్నట్టు చెప్పారు. కేశవ తాత మూడురోజుల క్రితం చనిపోగా గురువారం ఉప్పలంకలో చిన్నదినం జరిగిందని, ఈ దినఖర్మకు వచ్చి బావ, బావమరిది పూటుగా మద్యం సేవించారని కరప ఎస్‌ఐ టి.రామకృష్ణ తెలిపారు. గాయపడిన ట్రాఫిక్‌ ఎస్‌ఐకి కరప పోలీస్‌స్టేషన్‌లోనే ప్రాఽథమిక చికిత్స చేయించి అనంతరం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులిరువురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రామకృష్ణ చెప్పారు.

Updated Date - Mar 29 , 2024 | 12:26 AM