Share News

రేపు బంద్‌ విజయవంతం చేయాలి

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:54 AM

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న దేశవ్యాప్త పారిశ్రామిక, గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మండలంలోని ఐ.పంగిడి గ్రామంలో బుధవారం బంద్‌ కరపత్రాన్ని ఆవిష్కరించి, ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.

రేపు బంద్‌ విజయవంతం చేయాలి
కొవ్వూరులో కరపత్రం ఆవిష్కరిస్తున్న కార్మిక సంఘాల నాయకులు

  • పలు కార్మిక సంఘాల నాయకులు.. కరపత్రాల ఆవిష్కరణ

కొవ్వూరు, ఫిబ్రవరి 14: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న దేశవ్యాప్త పారిశ్రామిక, గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మండలంలోని ఐ.పంగిడి గ్రామంలో బుధవారం బంద్‌ కరపత్రాన్ని ఆవిష్కరించి, ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రగతిశీల కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌కే మస్తాన్‌, ఐఎఫ్‌టీయూ నాయకుడు సీహెచ్‌ రమేష్‌ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని, దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దారాదత్తం చేస్తోందని, విశాఖ ఉక్కు సహా అన్ని ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటు పరం చేయడానికి పూనుకుందన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు పి.నాగేశ్వరరావు, క్రషర్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు గంటా కృష్ణ, దుర్గారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:54 AM