Share News

రేపటి నుంచి రైతు సంఘం రాష్ట్ర మహాసభలు

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:29 AM

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు ఈనెల 8, 9, 10 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరుగుతాయని మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు వెల్లడించారు.

రేపటి నుంచి రైతు సంఘం రాష్ట్ర మహాసభలు

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 6: ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు ఈనెల 8, 9, 10 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరుగుతాయని మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు వెల్లడించారు. ఈమేరకు శనివారం రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయంలో మహాసభల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ 8వ తేదీ ఉదయం పదిగంటలకు మున్సిపల్‌ స్టేడియం నుంచి రైతు ప్రదర్శన ప్రారంభమవుతుందని, 11 గంటలకు రివర్‌బే ఆహ్వానం హాలులో ప్రతినిధుల సభ జరుగుతుందని తెలిపారు. 26 జిల్లాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు ఈ సభలకు హాజరవుతున్నారని తెలిపారు. మహాసభల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కర్షక, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కూండ్రపు రాంబాబు, వి.కొండలరావు, పి.నాగేశ్వరరావు, కె.జ్యోతిరాజు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 01:29 AM