రేపు శ్రీరామ విజయయాత్ర
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:49 AM
అయోధ్య శ్రీరామ మందిరంలో ఈనెల 22న ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నందున రాజమహేంద్రవరంలో ఈ నెల 19న శ్రీరామ విజయయాత్ర నిర్వహిస్తున్నామని బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ సత్యగోపినాఽథ్ దాస్ ప్రభూజీ తెలిపారు.
రాజమహేంద్రవరం కల్చరల్, జనవరి 17: అయోధ్య శ్రీరామ మందిరంలో ఈనెల 22న ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నందున రాజమహేంద్రవరంలో ఈ నెల 19న శ్రీరామ విజయయాత్ర నిర్వహిస్తున్నామని బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ సత్యగోపినాఽథ్ దాస్ ప్రభూజీ తెలిపారు. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 19న మధ్యా హ్నం 2 గంటలకు రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్డు రామాలయం సెంటర్ నుంచి శ్రీరామ విజయ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రజలంతా పాల్గొనాలని యాత్ర కన్వీనర్ తోట సుబ్బారావు కోరారు. యాత్ర సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని 10 వాహనాలు, ఐదు వేల మంది భక్తజనం పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో రాము ,మురారి హరిదాసు, సదా రామదాసు, సుబ్రహ్మణ్యం ,హరి తదితరులు పాల్గొన్నారు.