Share News

ఈ ఏడాది ధర బాగు

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:45 AM

అంతర్జాతీయ మార్కెట్‌లో భార తదేశంలో పండించే ఎన్‌ఎల్‌ఎస్‌ పొగాకుకు డిమాండ్‌ ఉంటుందని పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ అన్నారు.

ఈ ఏడాది ధర బాగు
గోపాలపురంలో క్యూరింగ్‌ అయిన పొగాకును పరిశీలిస్తున్న పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌

అర్జెంటీనా, బ్రెజిల్‌లో ఉత్పత్తి తగ్గడమే కారణం

పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌

దేవరపల్లి/గోపాలపురం, ఫిబ్రవరి 6 : అంతర్జాతీయ మార్కెట్‌లో భార తదేశంలో పండించే ఎన్‌ఎల్‌ఎస్‌ పొగాకుకు డిమాండ్‌ ఉంటుందని పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ అన్నారు. దేవరపల్లి, గోపాలపురం పొగాకు బోర్డు పరిధిలో ఉన్న మండలంలోని చిన్నాయి గూడెం, గోపా లపురం, వాదాలకుంట, వెదుళ్ళకుంట, కోమటికుంట, సంగాయిగూడెం, కృష్ణంపాలెం గ్రామాల్లోని పొగాకు తోటలు, క్యూరింగ్‌ చేసిన పొగాకును మంగళవారం పరిశీలించి మాట్లాడారు.ఈ ఏడాది వాతావరణం అనుకూ లించక పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారన్నారు. అయినప్పటికి రైతులు విస్తీర్ణం పెంచి పొగాకుతోటలను పెంచారన్నారు. గత ఏడాది ఎంఎల్‌ఎస్‌ ఏరియాలో 55 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి అయ్యిందని తెలిపారు. ఈ ఏడాది 60 నుంచి 62 మిలియన్ల కిలోలు ఉత్పత్తి అవు తుందని అంచనా వేశామన్నారు. పొగాకు ధరలు ఆశాజనకంగా ఉండ వచ్చన్నారు. అంతర్జాతీయంగా మనదేశంలో పండించే పొగాకుకు పోటీగా ఉన్న అర్జెంటీనా, బ్రెజిల్‌ దేశాల్లో పొగాకు ఉత్పత్తులు గణనీయంగా తగ్గ డమే కారణమన్నారు. కర్ణాటకలో 96 రోజుల్లో 72 మిలియన్‌ కిలోల పొగా కు కొనుగోలు చేశామని తెలిపారు. సరాసరి ధర కిలో రూ.250 పలికిం దన్నారు. మరో 15 రోజుల్లో కర్ణాటకలో పొగాకువేలం ప్రక్రియ పూర్తవుతు ందన్నారు. మన పొగాకు వేలం కేంద్రాల్లో మార్చి మొదటి వారంలో కొను గోళ్లు ఆరంభమవుతాయన్నారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పొగాకు బోర్డు ఆర్‌ఎం ఆదిశేషయ్య, గోపాలపురం పొగాకు బోర్డు రైతు సంఘం అధ్యక్షుడు పిన్నమనేని మధుమోహన్‌, గోపాలపురం, దేవరపల్లి వేలం నిర్వహణాధికారులు జీఎల్‌కే ప్రసాద్‌, డీ.శ్యామ్‌, ఎస్‌జీవోలు హేమ స్మిత, శివకుమార్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:45 AM