కన్నాపురం అటవీ ప్రాంతం వైపు పెద్ద పులి పాదముద్రలు
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:01 AM
పెద్దపులి ప్రస్తుతం గోపాలపురం మండలం కరగపాడు అటవీప్రాంతం నుంచి ఏలూరు జిల్లా కొవ్వాడ రిజర్వ్ ఫారెస్ట్ లోకి ప్రవేశించిందని రాజమహేంద్రవరం అటవీశాఖాధికారి ధనరాజు తెలి పారు.
9 గంటల వరకూ పొలం పనులకు వెళ్లవద్దు
ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే : అటవీ అధికారి
గోపాలపురం, ఫిబ్రవరి 5 : పెద్దపులి ప్రస్తుతం గోపాలపురం మండలం కరగపాడు అటవీప్రాంతం నుంచి ఏలూరు జిల్లా కొవ్వాడ రిజర్వ్ ఫారెస్ట్ లోకి ప్రవేశించిందని రాజమహేంద్రవరం అటవీశాఖాధికారి ధనరాజు తెలి పారు. గోపాలపురం మండలం కరగపాడు అటవీ ప్రాంతంలో పందిపై దాడి చేసిన ప్రాంతాన్ని సోమవారం పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం పెద్దపులి పాదముద్రలు కన్నాపురం అటవీప్రాంతం వైపు ఉన్నాయన్నారు. అటు నుంచి పాపికొండల అభయారణ్యంలోకి పులి చేరవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొన్ని రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉదయం 9 గంటల వరకు పొలం పనులకు వెళ్లవద్దని సూచించారు.పొలంలోని పశువులను ఇళ్ళ వద్దకు తీసుకురా వాలని 5గంటలు దాటిన తరువాత ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పులిదాడిలో చనిపోయిన పందికి సంబంధించి రైతుకు నష్టపరిహారం కింద రూ.4 వేలు అందజేశారు. చనిపో యిన పందికి అంత్యక్రియలు జరిపించినట్టు తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ ఆర్వో వేణుగోపాల్, ఎఫ్‌డీవో కార్తీక్ తదితరులు ఉన్నారు.