24 గంటల్లో దొంగ ఆట కట్టించారు
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:42 AM
బొమ్మూరు పోలీసులు 24 గంటల్లో దొంగ ఆట కట్టించారు. నెల్లూరు జిల్లాకు చెందిన వెల్లిబోయిన వినయ్ దైవ దర్శనానికి 26న పిఠాపురం వచ్చాడు. అక్కడ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.
రాజమహేంద్రవరం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): బొమ్మూరు పోలీసులు 24 గంటల్లో దొంగ ఆట కట్టించారు. నెల్లూరు జిల్లాకు చెందిన వెల్లిబోయిన వినయ్ దైవ దర్శనానికి 26న పిఠాపురం వచ్చాడు. అక్కడ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరూ సాయంత్రానికి రాజమహేంద్రవరం వచ్చి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మెట్రో లాడ్జిలో దిగారు. ఉదయం నిద్ర లేచి చూసే సరికి కెమెరా, ల్యాప్‌టాప్, ఆ వ్యక్తి కనిపించలేదు. దీంతో వినయ్ బొమ్మూరు పోలీసులను ఆశ్రయించాడు. సీఐ ఎండీ ఉమర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ జగన్ మోహన్ తన సిబ్బందితో రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలు ఆధారంగా కాకినాడకు చెందిన పిల్లారిశెట్టి శ్రీనివాస్‌ని నిందితుడిగా గుర్తించి ఆదివారం అరెస్టు చేశారు. సుమారు రూ.1.20లక్షల విలువ చేసే చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు పరిష్కారంలో ప్రతిభ చూపిన సీఐ ఉమర్, ఎస్‌ఐ జగన్, ఏఎస్‌ఐ ఏకే సత్యనారాయణ, పీసీ సురేశ్‌ని ఎస్పీ జగదీశ్ అభినందించారు.