Share News

నూకాంబికా ఆలయంలో చండీహోమం

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:25 AM

చింతలూరు నూకాంబికా అమ్మవారి ఆలయం లో సోమవారం అమావాస్య సందర్భంగా చండీ హోమం జరిపారు.

నూకాంబికా ఆలయంలో చండీహోమం

ఆలమూరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): చింతలూరు నూకాంబికా అమ్మవారి ఆలయం లో సోమవారం అమావాస్య సందర్భంగా చండీ హోమం జరిపారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వుండవల్లి వీర్రాజు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హోమాన్ని పండితులు శాస్త్రోక్తంగా చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హోమంలో పాల్గొని పూజలు చేశారు. దీన్ని తిలకించేందుకు పలు గ్రామాల భక్తజనం పాల్గొని అమ్మవారికి పూజలు జరిపారు. కార్య క్రమంలో గ్రామ ప్రముఖులతో పాటు, పలు వురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 01:25 AM