Share News

ఆలయ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:37 AM

చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయా న్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.

ఆలయ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి

ఆలమూరు, డిసెంబరు 26(ఆంధ్ర జ్యోతి): చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయా న్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. దీనికి ప్రభుత్వంతోపాటు భక్తుల సమష్టి కృషి అవసరం అన్నారు. అమ్మవారి ఆలయంలో రూ.1.60 కోట్లతో నిర్మించిన ప్రాకారం మండపాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఆలయం వద్ద గనిపోతురాజు ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది జరిగే ఉత్సవాల్లో లక్షలాదిగా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంద న్నారు. ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఉండవల్లి వీర్రాజు, సర్పంచ్‌ మార్గాని కరుణ, నాయకులు వైట్ల శేషుబాబు, దండంగి మమత, గన్ని వెంకట్రావు, వైట్ల గంగరాజు, చింతలూరు ఫణి, ఎంపీడీవో ఎ.రాజు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:37 AM