Share News

కిటకిటలాడిన వాడపల్లి ఆలయం

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:34 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది.

కిటకిటలాడిన వాడపల్లి ఆలయం

ఆత్రేయపురం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. వేకువజామునే స్వామివారికి తీర్థపు బిందెతో గోదావరి జలాలను తీసుకువచ్చి స్నపన మూర్తులకు అభిషేకం చేశారు. అనంత రం తిరుప్పావై వేదపారాయణం జరిపారు. నోము ఆచరించిన పలువురు భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి ఒకరోజు ఆదాయం రూ.3,54,604 వచ్చినట్టు ఉప కమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.

Updated Date - Dec 27 , 2024 | 12:35 AM