Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:13 AM

సామర్లకోట, ఏప్రిల్‌ 7: తెలుగుదేశం పార్టీలోకి సామర్లకోట మండలం పి.వేమవరం గ్రామానికి చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు ఆదివారం సాయంత్రం చేరారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్‌, ముసిరెడ్డి శ్రీరాములు, ముసిరెడ్డి రాంబాబుల ఆధ్వర్యంలో నిర్వహించిన కా

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
సామర్లకోట: టీడీపీలో చేరుతున్నవారికి కండువాలు కప్పి అభినందిస్తున్న రాజప్ప

సామర్లకోట, ఏప్రిల్‌ 7: తెలుగుదేశం పార్టీలోకి సామర్లకోట మండలం పి.వేమవరం గ్రామానికి చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు ఆదివారం సాయంత్రం చేరారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్‌, ముసిరెడ్డి శ్రీరాములు, ముసిరెడ్డి రాంబాబుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేడిది తమ్మిరాజు, శ్రీపతి సోంబాబు, మేడిది ప్రభాక రరావు, మేడిది ధర్మరాజు, రాఘవమ్మ తదితర కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధి, సంక్షేమం కోసం నిరం తరం శ్రమించే చంద్రబాబును తిరిగి ఈ రా ష్ట్రానికి ముఖ్యమంత్రిగా గెలిపించాల్సిన ఆవసరం అందరిపైనా ఉందని రాజప్ప చెప్పారు. టీడీపీ విజయానికి అందరు కృషి చేయాన్నారు. కూట మి నాయకులు తుమ్మల బాబు, విత్తనాల వెంక ట రమణ, టీడీపీ మండల అధ్యక్షుడు తోటకూర శ్రీనివాస్‌ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రత్తిపాడు/రౌతులపూడి: ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయం వద్ద ఆదివారం రౌతులపూడికి చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. రౌతులపూడి టీడీపీ నాయకులు పైలా సాంబశివరావు ఆధ్వర్యంలో గుబ్బల నాగేశ్వరరావు, దమ్ము రాం బాబు, దమ్ము సత్యనారాయణ, దమ్ము సత్తిబాబు, పోశెట్టి శ్రీను, రాజు, సత్తిబాబు, నడిగట్ల అప్పారావు, గుబ్బల సూర్యవెంకటరమణ తదితరులు టీడీపీలోకి చేరారు. రౌతులపూడి మండ లాధ్యక్షులు తమరాన సత్యనారాయణ ఉన్నారు.

తాళ్లరేవు: తాళ్లరేవు పంచాయతీ గిడ్లవారిపేటకు చెందిన దళితులు వైసీపీని వీడి ముమ్మిడివరం ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో మురమళ్లలో టీడీపీలో వడ్డి విజయ్‌కుమార్‌ నాయకత్వంలో చేరారు. చేరినవారిలో అల్ల ంపల్లి చిన్న, సత్యనారాయణ, పోలినాటి అన్న వ రం, లోవరాజు, నాని, అప్పారావు, బల్ల చిరంజీ వి,జక్కల వెంకటరమణ, శ్రీనివాసరావులున్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:13 AM