Share News

‘మమ్మల్ని రెగ్యులరైజ్‌ చేయాలి’

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:37 PM

పిఠాపురం, జూన్‌ 17: వైసీపీ ప్రభుత్వంలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది రెగ్యులరైజ్‌ చేయాలని డీఎస్సీ 2008 ఎంపికై మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌లో నియమితులైన ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వెలుగు టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వ ర్యంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 200మందికి పైగా ఉపాధ్యాయులు సోమవారం పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మను కలిసి వినతిపత్రం

‘మమ్మల్ని రెగ్యులరైజ్‌ చేయాలి’

పిఠాపురం, జూన్‌ 17: వైసీపీ ప్రభుత్వంలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది రెగ్యులరైజ్‌ చేయాలని డీఎస్సీ 2008 ఎంపికై మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌లో నియమితులైన ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వెలుగు టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వ ర్యంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 200మందికి పైగా ఉపాధ్యాయులు సోమవారం పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. డీఎస్సీలో ఎంపికైన 2,193 మందిని వైసీపీ ప్రభుత్వం రెగ్యులర్‌గా కాకుండా మినిమమ్‌ టైం స్కేలులో కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలిచ్చి తమకు తీరని అన్యాయం చేసిందని తెలిపారు. తమను రెగ్యులర్‌ ఉద్యోగులుగా నియమించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని వారు విన్నవించారు. వర్మ స్పందిస్తూ రెగ్యులరైజ్‌ చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పవన్‌ గెలుపులో కీలకపాత్ర పోషించిన వర్మను వారు ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ వెలుగు టీచర్స్‌ ఫెడరేషన వ్యవస్థాపక అధ్యక్షురాలు పిల్లా వెలుగు జ్యోతి, గొల్లప్రోలు మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్‌, అప్పా రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా చంద్రం, నాని, శ్రీను, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 11:37 PM