Share News

ఉపాధ్యాయ పోస్టులు తగ్గించి ఒత్తిడిపెంచిన ప్రభుత్వం

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:44 AM

ఉపాధ్యాయ పోస్టులు తగ్గించి ఒత్తిడిపెంచిన ప్రభుత్వం

ఉపాధ్యాయ పోస్టులు తగ్గించి ఒత్తిడిపెంచిన ప్రభుత్వం

అల్లవరం, జనవరి 29: రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.117 ద్వారా పాఠశాలలను విలీనం చేసి ఉపాధ్యాయ పోస్టులు తగ్గించి యాప్‌లతో ఒత్తిడి పెం చిందని ఎస్టీయూ రాష్ట్రఅధ్యక్షుడు ఎల్‌.సాయిప్రసాద్‌ఆరోపించారు. ఎస్టీయూ జిల్లా సమావేశం జిల్లా శాఖ అధ్యక్షుడు నేరేడుమల్లి సత్యనారాయణ అధ్యక్షతన అల్లవరంలోని సత్యకస్తూరి కల్యాణ మండపంలో సోమవారం జరిగింది. విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిలో కొత్త పోస్టులు మంజూరు చేయాలని, డీఎస్సీ వెంటనే ప్రకటించాలన్నారు. పీఆర్సీ ప్రకటించి 12 నెలలైనా నేటికీ ఐఆర్‌ ప్రకటించలేదన్నారు. జీపీఎస్‌ రద్దు చేసి వెంటనే ఓపీఎస్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఎంపీపీ ఇళ్ళ శేషగిరిరావు, జడ్పీటీసీ కొనుకు గౌతమి, ప్రధాన కార్యదర్శి వి.సత్యనారాయణ, సుదర్శన చక్రవర్తి, రాష్ట్ర నాయకులు పోసుంశెట్టి దొరబాబు, నల్లిప్రసాద్‌, ఉమాపతి శాస్త్రి, నాగిరెడ్డి శివప్రసాద్‌, మోరి విజయకుమారి, ఎస్‌ఎస్‌ పల్లంరాజు, వైవీ నాగభూషణం, బోనం గంగాధర్‌, రత్నకుమారి, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:44 AM