టీడీపీ కార్యక్రమాలను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Feb 02 , 2024 | 01:26 AM
తెలుగుదేశం పార్టీ ఆదేశించిన ఓటరు లిస్ట్ వెరిఫికేషన్ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలను క్లస్టర్ యూనిట్ బూత్ స్థాయిలో పక్కాగా చేయాలని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నా రు.
మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు
నిడదవోలు, ఫిబ్రవరం 1: తెలుగుదేశం పార్టీ ఆదేశించిన ఓటరు లిస్ట్ వెరిఫికేషన్ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలను క్లస్టర్ యూనిట్ బూత్ స్థాయిలో పక్కాగా చేయాలని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నా రు. గురువారం నిడదవోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్‌స్థాయిలో నాయకులకు ఇంటిగ్రేటెడ్ శిక్షణా కార్య క్రమం నిర్వహించారు. శిక్షణ ఇచ్చిన ఉప్పులూరి జానకి రామయ్య మాట్లాడు తూ నియోజకవర్గంలో ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా పార్టీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు తన్నీడి బోసు, ఆకుతోట సతీష్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బూత్‌స్థాయి నాయకులు కష్టపడి పనిచేయాలి
ఉండ్రాజవరం, ఫిబ్రవరి 1: బూత్‌స్థాయి నాయకులు కష్టపడి పనిచేయా లని మండల టీడీపీ అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం వేలివెన్ను గ్రామంలో ఉండ్రాజవరం క్లస్టర్‌లోని బూత్ కన్వీనర్‌లకు జరిగిన ఇంటిగ్రేటెడ్ శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని బూత్ స్థాయి ప్రజలకు టీడీపీ నాయకులు వివరించాలని కోరారు. టీడీపీ మ్యానిఫెస్టోలో పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేయాలని కోరారు. అదేవిధంగా ఓటరు లిస్టుల వెరిఫికేషన్ చేశారు. క్లస్టర్ ఇన్‌చార్జిలు ఈర్పిన సత్యనారాయణ, ముళ్ళపూడి పాండురంగ పాల్గొన్నారు.
కొవ్వూరు తరలివెళ్లిన టీడీపీ శ్రేణులు
చాగల్లు, ఫిబ్రవరి 1: కొవ్వూరులో జరిగిన టీడీపీ ఆత్మీయ సమావేశానికి మండలం నుంచి టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. మాజీ ఏఎంసీ చైర్మన్ ఆళ్ళ హరిబాబు, నాదెళ్ళ శ్రీరామ్‌ల ఆధ్వర్యంలో కేతా సాహెబ్, పార్టీ నాయకులు దొంగ రామకృష్ణ, ఆళ్ల సూర్యప్రకాశరావు, పాశం రామకృష్ణ, ఈడుపుగంటి సుబ్బారావు, ఊబా దుర్గ తదితరులు తరలివెళ్లారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థి ఎంపిక ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళా సంక్షేమమే టీడీపీ ధ్యేయం
ఫ నగర మహిళ, అంగన్వాడీ కమిటీ ప్రమాణస్వీకారంలో నేతలు
రాజమహేంద్రవరం సిటీ, పిబ్రవరి 1 : మహిళా సంక్షేమమే టీడీపీ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం తాడితోటలోని రవణం శ్రీరాములు కల్యాణ మండపంలో గురువారం నగర తెలుగు మహిళా కమిటీ, అంగన్వాడీ కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. సమాజంలో మహిళలు శక్తివంతులుగా ఎదగడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సంస్కరణలే కారణమన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, బీసీ సీనియర్ నాయకులు రెడ్డి రాజు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, నగర అధ్యక్షుడు రెడ్డి మణి, తెలుగుమహిళా పార్లమెంట్ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి , నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు కొసూరి చండీప్రియ , నగర అంగన్వాడీ అధ్యక్షురాలు బోను ఈశ్వరీ తదితరులు పాల్గొన్నారు.
కొవ్వూరు టీడీపీలో గ్రూపులు
జవహర్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ ఆత్మీయ సమావేశం
ద్విసభ్యకమిటీ సభ్యుడు కంఠమణితోపాటు ప్రముఖుల హాజరు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి1 (ఆంధ్రజ్యోతి): కొవ్వూరు టీడీపీలో విభేదా లు మరోసారి బయటపడ్డాయి. మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కెఎస్ జవహర్‌కు కొవ్వూరు టికెట్ ఇవ్వొద్దని ఆయన వ్యతిరేకవర్గం ఆత్మీయ సమా వేశం పేరిట గురువారం బల ప్రదర్శనకు దిగారు. కొవ్వూరు లిటరరీ క్లబ్‌లో గురువారం సాయంత్రం నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ఎన్నికల ముందుకూడా ఇదే పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికలలో కెఎస్ జవహర్ ఇక్కడ పోటీచేసి మంత్రి అయ్యారు. కానీ ఆయనతో అక్కడ ఓ బలమైన వర్గంలోని పెద్దలతో విబేధాలు రావడంతో 2019 ఎన్నికలలో ఆయనను ఇక్కడ పోటీ చేయనీయమన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఇంతవరకూ ఎవరినీ ఇన్‌చార్జిగా కూడా నియమించలేదు. ఇద్దరు నాయకులతో ద్విసభ్య కమిటీవేసి, వారితో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈద్విసభ్య కమిటీలో ఒకరు జవహర్ వర్గం, మరొకరు వ్యతిరేక వర్గంగా చెబుతుంటారు. ఎన్నికలు సమీపిస్తున్న సమ యంలో ఈసారి ఇక్కడ నుంచే పోటీచేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా వ్యహరిస్తున్నారు. ఇటీవల అఽధిష్టానం కెఎస్ జవహర్‌కు టికెట్ ఇస్తుందనే ప్రచారం బాగా జరుగుతోంది. గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వేంకటేశ్వరరావుకు ఈ టికెట్ ఇస్తారనే మరో ప్రచారం ఉంది. ఇంకా నలుగురైదుగురు టికెట్ ఆశిస్తున్నారు. ఈనేపథ్యంలో కెఎస్ జవహర్ వ్యతిరేక వర్గంగా ఉన్న ఈకింగ్‌మేకర్‌గా ఉన్న అచ్చిబాబు వర్గంగా చెబుతున్న నాయకులు, కార్యకర్తలు ఇక్కడ సమావేశమ య్యారు. ఇక్కడ వర్గాలను జవహర్ ప్రోత్సహిస్తున్నారని, అందువల్ల జవహర్ కు ఎట్టిపరిస్థితులలోనూ సీటు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తూ ఓ తీర్మానం కూడా చేశారు. ఇంకెవరిని పోటీ పెట్టినా ఇబ్బందిలేదని కూడా స్పష్టం చేశారు. ఇది టీడీపీలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈసమావేశంలో ద్విసభ్యకమిటీ సభ్యుడు కంఠమణి రామకృష్ణ. మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహనరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ హరిబాబు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మద్దిపాటి శివరామకృష్ణ. నాదెళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని జవహర్ అఽధిష్టానం దృష్టికి తీసుకుని వెళుతున్నట్టు సన్నిహితులవద్ద చెప్పినట్టు సమాచారం.
జవహార్ వద్దు టీడీపీ ముద్దు
తాళ్లపూడి, ఫిబ్రవరి 1: తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామం నుంచి టీడీపీ యువగళం నాయకులు జవహార్ వద్దు టీడీపీ ముద్దు అనే నినాదంతో రెండు బస్సులలో కొవ్వూరు సభకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తాళ్ళపూడి బస్టాండ్ వద్ద యువగళం నాయకులు కాకర్ల సత్యేంద్ర మా ట్లాడుతూ మాజీ మంత్రి కెఎస్ జవహార్ టీడీపీ నాయకులు మధ్య విభేదాలు సృష్టిస్తూ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని పార్టీకి నష్టమొచ్చేలా ఆయన చర్యలు ఉన్నాయని 2019కి ముందు నుంచే తాము ఉద్యమం చేస్తున్నామని అందువల్లే ఆయన తిరువూరు వెళ్లారని తిరిగి తూర్పుగోదావరిజిల్లా పార్లమెం టరీ అధ్యక్ష స్థానానికి వచ్చి కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసే వారిన పక్కనపెట్టి పనిచేయని వారికి పదవులు కట్టబెట్టడం ద్వారా ఆయన విభేదాలు తీసుకు వస్తున్నారని అలాంటి వ్యక్తి కొవ్వూరు నుంచి పోటీ చేసే అవకాశాన్ని కలిపించ వద్దని అధిష్టానాన్ని కోరుతున్నారు.