కూటమి ప్రభుత్వంతోనే గ్రామ స్వరాజ్యం : యనమల
ABN , Publish Date - Sep 10 , 2024 | 12:47 AM
తునిరూరల్, సెప్టెంబరు 9: గ్రామ స్వరాజ్యం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చే
తునిరూరల్, సెప్టెంబరు 9: గ్రామ స్వరాజ్యం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశా రు. వరద పీడిత గ్రామ పంచాయతీలకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సొంత నిధుల నుంచి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం తునిలో సోమవారం జరిగింది. ముఖ్య అతిఽథిగా యనమల మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీలను పూర్తిగా సర్వనాశనం చేశారని, వాటిని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అహ ర్నిశలు శ్రమిస్తుందన్నారు. పవన్ ఇచ్చే నిధులు క్షేత్రస్థాయిలో పూర్తిగా సఫలీకృతం అ వ్వాలని అందుకనుగుణంగా నాయకులు, అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన నాయకులు తు మ్మల బాబు, తోట నగేష్, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు, సుర్ల లోవరాజు, చింతమనీడి నాగ సోమరాజు, ఇనిగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్ ఉన్నారు.