Share News

నేడే.. రా కదలిరా!

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:55 AM

ఇక కొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరిం చడానికి తూర్పుగోదావరి సిద్ధమైంది. వచ్చే ఎన్నికలకు కేడర్‌, ప్రజలను సిద్ధం చేయడానికి, ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ర్టాన్ని ఛిన్నాభిన్నం చేసిన అధికార వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సోమవారం తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.

నేడే.. రా కదలిరా!
తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా సభకు సిద్ధమవుతున్న ప్రాంగణం

ఉదయం 10 గంటలకు ఆరంభం

2 లక్షల మంది వస్తారని అంచనా

23 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు

రాజమహేంద్రవరం, జనవరి 28(ఆంధ్రజ్యోతి) : ఇక కొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరిం చడానికి తూర్పుగోదావరి సిద్ధమైంది. వచ్చే ఎన్నికలకు కేడర్‌, ప్రజలను సిద్ధం చేయడానికి, ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ర్టాన్ని ఛిన్నాభిన్నం చేసిన అధికార వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సోమవారం తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేప ఽథ్యంలో ప్రతి జిల్లాలోనూ జిల్లా స్థాయి బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలోని కాతేరులో సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. లక్షలాది మందికి స్వాగతం పల కడానికి కాతేరు గ్రామం ముస్తాబైంది. తూర్పుగోదావరి జిల్లా లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సభ జరగ నుంది.గోదావరి ఫోర్త్‌ బ్రిడ్జి సమీపంలోని కాతేరులోని తిరుమల విద్యాసంస్థల సమీపంలోని 23 ఎకరాల విశాలమైన మల్లు లే అవుట్‌లో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద వేదిక తో పాటు సభకు హాజరయ్యేవారికి ఇబ్బందిలేకుండా భారి కేడ్లతో గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వేదిక మీద సుమారు 100 మంది కూర్చునేటట్టు సిద్ధం చేశారు.వేదిక ముందు 10 వేల మంది వీఐపీలు కూర్చునేలా కుర్చీలు వేసి ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు.మరో పక్క మీడియాకు ఏర్పాట్లు చేశారు. 2 లక్షల మంది పట్టే విఽధంగా విశాలమైన గ్రౌండ్‌ను సిద్ధం చేశా రు. ప్రాంగణం ఫెక్సీలు, పసుపు జెండాలతో ధగధగ వెలిగి పోతోంది. సమీపంలోని తిరుమల కాలేజీ ప్రక్కన హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం పరిధి లోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల నుంచి సుమారు 2 లక్షల మంది హాజరవుతారని సమాచారం. ఒక్కో నియోజకవర్గం నుంచి 30 వేల మంది వచ్చేటట్టు ఆయా నేతలు బాధ్యతలు తీసుకున్నారు. పార్కింగ్‌ ఇబ్బందులు లేకుండా ఆయా నియో జకవర్గాలకు వేర్వేరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఉదయం 10గంటలకే ప్రారంభమవుతుంది. చంద్రబాబు సుమారు 11.25 గంటలకు సభకు చేరుకుని, 1గంటకు తన ఉపన్యాసం ముగిస్తారు. సభ ఏర్పాట్లను మూడు రోజుల నుంచి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి విపక్షనేత యనమల రామకృష్ణుడు,మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రులు కెఎస్‌ జవహర్‌, ప్రత్తిపాటిపుల్లారావు, గుడా మాజీ చైర్మన్‌ గన్నికృష్ణ, జోన్‌-2 పరిశీలకుడు మందలపు రవి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం కూడా వారు ఇక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించారు.సభకు టీడీపీ, జనసేన క్యాడర్‌ తరలిరానుంది. నెల్లూరు జిల్లాలో పర్యటన ముగించుకుని ఉదయం 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో రాజమహేంద్ర వరం విమానాశ్రయానికి వస్తారు.అక్కడ నుంచి రోడ్డు మార్గాన 11.25 గంటలకు బయలుదేరి కాతేరులోని మల్లు లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వస్తారు. 11.45 గంటల నుంచి ఒంటి గంట వరకూ బహిరంగ సభలో పాల్గొంటారు.అనంతరం 1.50 గంటలకు బయలుదేరి కాతేరు లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని వడ్లమూడి గ్రామం వెళతారు.

చంద్రబాబుకు భారీ స్వాగత ఏర్పాట్లు

అక్రమ కేసుల్లో 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో నిర్భందానికి గురై విడుదలై వెళ్లిన తర్వాత బహిరంగ సభలో పాల్గొనేందుకు తొలిసారిగా జిల్లాకు వస్తున్న నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలకడానికి నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లా నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలక నున్నారు. అక్కడ నుంచి కారులో సభకు చేరుకుంటారు.

Updated Date - Jan 29 , 2024 | 12:55 AM