Share News

జగన్‌ పాలనను అంతమొందించేందుకే లోకేశ్‌ ‘శంఖారావం’

ABN , Publish Date - Feb 11 , 2024 | 12:19 AM

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఐదేళ్లుగా పట్టిపీడిస్తున్న జగన్‌రెడ్డి రాక్షస పాలనను అంతమొందించేందుకే టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేశ్‌ తలపెట్టిన శంఖారావం కార్య క్రమం విజయవంతానికి టీడీపీ నాయకులు, కార్య కర్తలంతా సంసిద్ధం కావాలని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల

జగన్‌ పాలనను అంతమొందించేందుకే లోకేశ్‌ ‘శంఖారావం’
గొల్లప్రోలు రూరల్‌: ఏకేమల్లవరంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

జయప్రదం చేయాలని కోరిన టీడీపీ నేతలు

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఐదేళ్లుగా పట్టిపీడిస్తున్న జగన్‌రెడ్డి రాక్షస పాలనను అంతమొందించేందుకే టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేశ్‌ తలపెట్టిన శంఖారావం కార్య క్రమం విజయవంతానికి టీడీపీ నాయకులు, కార్య కర్తలంతా సంసిద్ధం కావాలని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులను దోచుకుని, అన్ని రంగాల వారికి అన్యాయం చేసి రాష్ట్రాన్ని సర్వనా శనం చేసిన ఘనత జగన్‌రెడ్డి, అతడి బృందానికి మాత్రమే దక్కుతుందన్నారు. సీఎం జగన్‌రెడ్డి సాగిస్తున్న అరాచక పాలనపై నారా లోకేశ్‌ పూరిం చిన నాధమే శంఖారావం కార్యక్రమం అని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. టీడీపీ సిటీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మా ట్లాడారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలపై పోరాటం చేశారన్నారు. నేడు శంఖారావం ద్వారా నియోజకవ ర్గాల్లో పర్యటించి జగన్‌ ప్రభుత్వ దౌర్జన్యాలను నిలదీస్తూ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించనున్నార న్నారు. వైసీపీ ప్రభుత్వ పథకాల ప్రచారానికి విశ్వ విద్యాలయాలను వదలిపెట్టడం లేదని, కాకినాడలోని జేఎన్టీయూకేలో విద్యార్థులు బయటకు పోకుండా ఆడిటోరియానికి తాళాలు వేసి వైసీపీ పథకాలపై సెమినార్‌ నిర్వహించడం సిగ్గుచేటని ఖండించారు. సమావేశంలో టీడీపీ నగర అఽధ్యక్ష ప్రధాన కార్యద ర్శులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్‌ పాల్గొన్నారు.

గొల్లప్రోలు రూరల్‌: సీఎం జగన్‌రెడ్డి, వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేఖంగా నారా లోకేశ్‌ పూరించిన నాధమే శంఖారావమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు. గొల్లప్రోలు మండలం ఏకేమల్లవరంలో శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయ న మాట్లాడుతూ శంఖారావంలో భాగంగా లోకేశ్‌ 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని తెలిపారు. వైసీపీ నేతల అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా లోకేష్‌ యువగళం పేరుతో 220 రోజులు 31 32 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారని చెప్పారు. టీడీపీ మండల, గ్రామ అధ్యక్షులు ఉలవకాయల దేవేంద్రుడు, పాలపర్తి వీర్రాజు, గనసాల నాగరాజు, మల్లిబాబు, కడిమిశెట్టి భాస్కరరెడ్డి, మడికి ప్రసాద్‌, మల్లిపూడి వీరబాబు, రెడ్డెం భాస్కరరావు ఉన్నారు.

జగ్గంపేట: త్వరలో నారా లోకేశ్‌ శంఖారావం కార్యక్రమం నిర్వహిస్తారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేటలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ శంఖారావం ద్వారా లోకేశ్‌ రోజుకు 3 నియోజకవర్గాలు పర్యటించి కొన్ని గ్రామాలను లోకేష్‌ సందర్శిస్తారన్నారని తెలిపారు. శంఖారావడంతో టీడీపీ కార్యకర్తల కదలికలలతో జగన్మోహన్‌ రెడ్డికి తిరోగమనం కనిపిస్తుందన్నారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఒకటిగా శంఖారావం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

Updated Date - Feb 11 , 2024 | 12:19 AM