Share News

వర్మకు టీడీపీ టిక్కెట్‌ ఇవ్వకుంటే రాజీనామాలు

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:56 AM

పిఠాపురం, మార్చి 7: తెలుగుదేశం-జనసేన పొత్తులో భాగంగా పిఠాపురం సీటును టీడీపీకే కేటాయించి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మకు టిక్కెటు ఇవ్వాలని, లేకుంటే సామూహిక రాజీనామాలకు సిద్ధమని టీడీపీ నేతలు ప్రకటించారు. పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేనకు కేటాయిస్తారని విస్తృత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అందోళనకు గురైన నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పిఠాపురం పాత టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. పలువురు నాయకులు మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా నియోజకవర్గంలో పార్టీ పటిష్టత, అభివృద్ధికి చేసిన కృ

వర్మకు టీడీపీ టిక్కెట్‌ ఇవ్వకుంటే రాజీనామాలు
సమావేశానికి హాజరైన టీడీపీ నాయకులు

పిఠాపురంలో టీడీపీ నేతల సమావేశం

పిఠాపురం, మార్చి 7: తెలుగుదేశం-జనసేన పొత్తులో భాగంగా పిఠాపురం సీటును టీడీపీకే కేటాయించి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మకు టిక్కెటు ఇవ్వాలని, లేకుంటే సామూహిక రాజీనామాలకు సిద్ధమని టీడీపీ నేతలు ప్రకటించారు. పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేనకు కేటాయిస్తారని విస్తృత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అందోళనకు గురైన నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పిఠాపురం పాత టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. పలువురు నాయకులు మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా నియోజకవర్గంలో పార్టీ పటిష్టత, అభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిదన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వర్మ ఓడినా నిరంతరం ప్రజల్లో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి, అధికార పార్టీ వేధింపులు నుంచి రక్షించడానికి అండగా నిలబడ్డారని తెలిపారు. పార్టీకి రాత్రింబవళ్లు శ్రమిస్తున్న వర్మకు ఎన్నికలు వచ్చేసరికి టిక్కెట్‌ విషయంలో మొండిచేయి చూపిస్తున్నారని మండిపడ్డారు. పొత్తులో భాగంగా టీడీపీకే ఇక్కడ సీటు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వర్మకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, సామూహిక రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. పార్టీ నాయకత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే వర్మను ఇండిపెండెంట్‌గా నిలబెట్టి గెలిపించుకుంటామని తెలిపారు. సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొండేపూడి ప్రకాష్‌, పట్టణ, మండలాధ్యక్షులు రెడ్డెం భాస్కరరావు, సకుమళ్ల గంగాధర్‌, అనిశెట్టి సత్యానందరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు బర్ల అప్పారావు, మడికి ప్రసాద్‌, దేవరపల్లి రామారావు, నల్లా శ్రీను, పిల్లి చిన్నా, అల్లవరపు నగేష్‌ పాల్గొన్నారు.

రాజీనామాలు ప్రకటించడం బాధాకరం : వర్మ

పొత్తులో భాగంగా పిఠాపురం టిక్కెట్టును జనసేనకు కేటాయిస్తున్నారన్న ప్రచారంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆవేదనకు గురై రాజీనామాలు ప్రకటించారని, ఇది బాధాకరమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. చంద్రబాబు తనకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని ప్రకటించారు. గురువారం రాత్రి వర్మ మీడియాతో మాట్లాడుతూ మీడియాలో వచ్చిన వార్తలు చూసి తమకు అన్యా యం జరుగుందనే భావనతో నాయకులు, కార్యకర్తలు సమావేశం పెట్టుకుని ఆ బాధలో అలా స్పందించి ఉంటారని అభిప్రాయపడ్డారు. సీటు ఇవ్వకుంటే తనకు బాధగా ఉంటు ందని తెలిపారు. చంద్రబాబు అభిమానిగా, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఆయన వెన్నంటే ఉంటానని ప్రకటించారు. వర్మ మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే కొం దరు కార్యర్తలు పార్టీ కార్యాలయం బయట టీడీపీ కరపత్రాలు తగులబెట్టారు. వర్మకు టిక్కెట్‌ ఇవ్వాలని నినాదాలు చేశారు. వర్మ వారిని మందలించారు. ఇటువంటి చర్యలకు పాల్పడటం తగదని, ఇలాంటి చేస్తే తాను పార్టీ కార్యాలయానికి రానని స్పష్టం చేశారు.

Updated Date - Mar 08 , 2024 | 12:56 AM