Share News

కూటమి అభ్యర్థి సత్యప్రభకు అభినందనలు

ABN , Publish Date - May 14 , 2024 | 11:45 PM

ప్రత్తిపాడు, మే 14: నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభరాజాకు మంగళవారం అభిమానుల అభినందనలు వెల్లువెత్తాయి. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకు లు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్తిపాడులోని తోటవీధిలో ఉన్న ఆమె స్వగృహానికి తరలివచ్చా రు. ఎన్నికల్లో సత్యప్రభకు అనుకూలమైన వాతావరణం నెలకొందని అభిమానులు, కార్యకర్తలు సత్యప్రభను అభినందించారు.

కూటమి అభ్యర్థి సత్యప్రభకు అభినందనలు
ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయం వద్ద సత్యప్రభను అభినందిస్తున్న వాకపల్లి టీడీపీ నాయకులు

ప్రత్తిపాడు, మే 14: నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభరాజాకు మంగళవారం అభిమానుల అభినందనలు వెల్లువెత్తాయి. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకు లు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్తిపాడులోని తోటవీధిలో ఉన్న ఆమె స్వగృహానికి తరలివచ్చా రు. ఎన్నికల్లో సత్యప్రభకు అనుకూలమైన వాతావరణం నెలకొందని అభిమానులు, కార్యకర్తలు సత్యప్రభను అభినందించారు. మండలంలోని వాకపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురందాస్‌ అప్పలరాజు ఆధ్వర్యంలో సర్పంచ్‌ రొంగల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ మురగా రమణ, మాజీ ఉపసర్పంచ్‌ గోకాడ చినబాబు, కురందాస్‌ చలపతిరావు బాబురావు తదితరులు సత్యప్రభను కలిసి అభినందించారు. అలాగే ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతప్రసాద్‌ సోదరులు పర్వత సత్యనారాయణమూర్తి, పర్వత సుభాష్‌, ఎమ్మెల్యే మేనల్లుడు కొండమూరి చంబాబు పెద్ద ఎత్తున అనుచరగళంతో కలిసి వచ్చి సత్యప్రభను అభినందించారు. అలాగే రౌతులపూడి, శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండల నాయకులు ఇతంశె ట్టి భాస్కరబాబు, బద్ది రామారావు, ఉల్లి వీరభద్రరావు, డాక్టర్‌ లక్ష్మినారాయణ, బద్ది రమణ, కొమ్ముల కన్నబాబు, అమరాది వెంకట్రావు, జ్యోతుల పెదబాబు, చిక్కాల లక్ష్మణరావు, సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన,బీబీజేపీ కారర్యకర్తలు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సత్యప్రభ తేటగుంట వెళ్లి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. తుని కూటమి అభ్యర్థి యనమల దివ్యతో సత్యప్రభ సమావేశమయ్యారు.

Updated Date - May 14 , 2024 | 11:45 PM