‘అభిమానులు, కార్యకర్తల కృషి మరువలేనిది’
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:17 AM
గండేపల్లి, జూన్ 16: నియోజకవర్గంలో జగ్గంపేట కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన తన తండ్రి జ్యోతుల నెహ్రూను 52వేల పైచిలుకు ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిపించడంలో టీడీపీ, జనసేన అభిమానులు, కార్యకర్తలు చేసిన కృషి మరువలేనిదని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్ అన్నారు. ఆయన

గండేపల్లి, జూన్ 16: నియోజకవర్గంలో జగ్గంపేట కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన తన తండ్రి జ్యోతుల నెహ్రూను 52వేల పైచిలుకు ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిపించడంలో టీడీపీ, జనసేన అభిమానులు, కార్యకర్తలు చేసిన కృషి మరువలేనిదని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్ అన్నారు. ఆయన ఆదివారం మల్లేపల్లిలో కార్యకర్తలతో కలిసి విలేకర్లతో మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గాభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఇప్పటి నుంచే అమలు చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాఽధ్యక్షుడు పోతుల మోహనరావు, జీను మణిబాబు, పరిమి బాబు, గ్రామ అధ్యక్షుడు తెలగరెడ్డి భద్రరావు, దిడ్డి చిన్నశ్రీను, చింతపల్లి వీరభద్రరావు, గ్రంధి నాగబాబు, దార్లంక శ్రీనివాసరావు, వల్లభశెట్టి కోటేశ్వరరావు, గొల్లపల్లి లోవరాజు, ఇంటి సత్యనారాయణ, తణుకు దుర్గారావు, దార్లంక నూకరాజు, కనకరాజు పాల్గొన్నారు.