Share News

విజయం మనదే

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:41 AM

కాకినాడ (ఆంధ్రజ్యోతి), జూన్‌ 3 : టీడీపీ కూటమి విజయం ఖాయం. మంగళవారం ఓట్ల లెక్కింపు ఫలితాల్లో కూటమి అఖండ మెజార్టీతో గెలవబోతోంది. జిల్లాలో అన్ని సీట్లు క్వీన్‌స్వీప్‌ చేయబోతోందని జిల్లా టీడీపీ, జనసేన అభ్యర్థులు ధీమా వ్యక్తంచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల కో ఆర్డినేటర్‌ సానా సతీష్‌ ఆధ్వర్యంలో వీరంతా సోమవారం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. కాకినాడ ఏడీబీ రోడ్డులోని సతీష్‌ క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్న

విజయం మనదే
టీడీపీ, జనసేన అభ్యర్థుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నేతలు

సానా సతీష్‌ క్యాంపు కార్యాలయంలో టీడీపీ, జనసేన అభ్యర్థుల ఆత్మీయ సమావేశం

కాకినాడ (ఆంధ్రజ్యోతి), జూన్‌ 3 : టీడీపీ కూటమి విజయం ఖాయం. మంగళవారం ఓట్ల లెక్కింపు ఫలితాల్లో కూటమి అఖండ మెజార్టీతో గెలవబోతోంది. జిల్లాలో అన్ని సీట్లు క్వీన్‌స్వీప్‌ చేయబోతోందని జిల్లా టీడీపీ, జనసేన అభ్యర్థులు ధీమా వ్యక్తంచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల కో ఆర్డినేటర్‌ సానా సతీష్‌ ఆధ్వర్యంలో వీరంతా సోమవారం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. కాకినాడ ఏడీబీ రోడ్డులోని సతీష్‌ క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్న విందులో వీరంతా భేటీ అయ్యారు. మాజీ మంత్రులు యనమల, రాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వర్మతోపాటు ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ, కాకినాడ రూరల్‌ నియోజకవర్గ జనసేన అభ్యర్థి పంతం నానాజీ, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్న ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. తొలుత యనమల మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సమయంలో టీడీపీ, జనసేన ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటమి భయంతో కౌంటింగ్‌ కేంద్రాల్లో గొడవలు చేయాలని వైసీపీ పథకం పన్నిన నేపథ్యంలో కూటమి ఏజెంట్లు ఎలాంటి కవ్వింపు చర్యలకు లోనవకుండా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కౌంటింగ్‌ కేంద్రాల నుంచి అసలు బయటకు రాకూడని వివరించారు. ఈ సందర్భంగా రాజప్ప, జ్యోతుల నెహ్రూ, వర్మ తదితరులు మాట్లాడుతూ కూటమి విజయం పక్కా అని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా నేతలంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా సతీష్‌ మాట్లాడుతూ కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కష్టించి పనిచేయడంతో మంచి ఫలితాలు సాధించబోతున్నామని తెలిపారు.

Updated Date - Jun 04 , 2024 | 12:41 AM