Share News

ఉమ్మడి మేనిఫెస్టోలో మహిళలకే అధిక ప్రాధాన్యం’

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:46 AM

టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫోస్టోలో మహిళలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షురాలు నాగాబత్తుల శాంతకుమారి అన్నారు.

ఉమ్మడి మేనిఫెస్టోలో మహిళలకే అధిక ప్రాధాన్యం’

పి.గన్నవరం,మార్చి8: టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫోస్టోలో మహిళలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షురాలు నాగాబత్తుల శాంతకుమారి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పి.గన్నవ రంలో ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు చేయూత, ఆసరా ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటారని అన్నారు. మహిళల కోసం తమ నేతలు చంద్ర బాబు, పవన్‌కల్యాణ్‌లు ముఖ్యమైన పఽథకాలు రూపొందించారని, ఉచిత బస్సు, విద్యార్థినిల ను విద్యాపరంగా ఆదుకోవడం, ఉచిత గ్యాస్‌ సిలెండర్లు వంటి పథకాలతో మహిళలను ముందంజలో ఉంచారన్నారు. జగన్‌కు వచ్చే ఎన్నికల్లో మహిళలందరూ గట్టిబుద్ధి చెప్పాలని కోరుతూ మహిళలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Mar 09 , 2024 | 08:34 AM