Share News

ఎంసీఎంసీ పనితీరు పరిశీలించిన ట్రైనీ కలెక్టర్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:19 AM

కలెక్టరేట్‌ (కాకినాడ), ఏప్రిల్‌ 27: జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమాచార కేంద్రాన్ని, మీడియా మోనిటరింగ్‌ కమిటీ(ఎంసీఎంసీ) పనితీరును ట్రైనీ కలెక్టర్‌ భావన శనివారం పరిశీలించారు. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఇస్తున్న ప్రచార అనుమతులను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్నికలపై వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన వార్తల వివరాలను ఆరా తీశారు. ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడి యాలో ప్రచురించిన ప్రకటనలు సంబంధి

ఎంసీఎంసీ పనితీరు పరిశీలించిన ట్రైనీ కలెక్టర్‌
ఎలకా్ట్రనిక్‌ మీడియాలో వచ్చే ప్రకటనలను పరిశీలిస్తున్న ట్రైనీ కలెక్టర్‌ భావన

కలెక్టరేట్‌ (కాకినాడ), ఏప్రిల్‌ 27: జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమాచార కేంద్రాన్ని, మీడియా మోనిటరింగ్‌ కమిటీ(ఎంసీఎంసీ) పనితీరును ట్రైనీ కలెక్టర్‌ భావన శనివారం పరిశీలించారు. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఇస్తున్న ప్రచార అనుమతులను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్నికలపై వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన వార్తల వివరాలను ఆరా తీశారు. ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడి యాలో ప్రచురించిన ప్రకటనలు సంబంధిత వ్యయ బృందా లు పంపించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంసీ ఎంసీలో విఽధులు నిర్వహిస్తున్న సిబ్బంది విధులను సమా చారశాఖ డీడీ నాగార్జున ఆమెకు వివరించారు. అనంతరం ఎంసీఎంసీ ద్వారా ఫ్రీ సర్టిఫికేషన్‌లో కొన్నింటిని ఆమె తిలకించి అభ్యంతరకర దృశ్యాలను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. ఎంసీఎంసీ సభ్యులు కృష్ణమూర్తి, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజినీర్‌ బాబూరావు పాల్గొన్నారు.

పెద్దాపురం: ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్టీ, వీవీటీ, వీఎస్ట్టీ బృందాల కోసం ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను ట్రైనీ కలెక్టర్‌ హెచ్‌ఎస్‌ భావన పరిశీలించారు. ఆర్వో సీతారామారావు పాల్గొన్నారు.

రన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:19 AM