‘వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ అవినీతి తిమింగళం’
ABN , Publish Date - May 07 , 2024 | 12:53 AM
తాళ్లరేవు, మే 6: ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్‌కుమార్ అవినీతి తిమింగళమని, జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో తాళ్లరేవు మండలంలో బినామీల ద్వారా భారీ అవినీతి చేశారని గాడిమొగ సర్పంచ్ కామాడి గోవలక్ష్మి భర్త మాతరాజు, ఎంపీటీసీ వనమాడి వేణి భర్త నూకరాజు ఆరోపించారు.
తాళ్లరేవు, మే 6: ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్‌కుమార్ అవినీతి తిమింగళమని, జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో తాళ్లరేవు మండలంలో బినామీల ద్వారా భారీ అవినీతి చేశారని గాడిమొగ సర్పంచ్ కామాడి గోవలక్ష్మి భర్త మాతరాజు, ఎంపీటీసీ వనమాడి వేణి భర్త నూకరాజు ఆరోపించారు. సోమవారం తాళ్లరేవు టీడీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. గాడిమొగలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పొన్నాడ మాపై తప్పు డు ఆరోపణలు చేయడంపై వారు ఖండించారు. మాపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, శ్రీవేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేసి నిరూపించాలని చాలెంజ్ చేశారు. గాడిమొగ జగనన్న ఇళ్లస్థలాల లేఅవుట్ కోసం 7ఎకరాల70సెంట్లు గ్రామకంఠం భూమికి సంబంధించి బినామీపేర్లుమీద ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. లక్ష్మీపతిపుర ంలో ఇళ్లస్థలాల లేఅవుట్ కోసం 3ఎకరాల 30సెంట్లు భూమికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నారని కానీ అక్కడ రెండు ఎకరాలు మాత్రమే ఉండటంతో ఎమ్మెల్యే బండారం బయటపడుతుందని లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు ఇవ్వకుండా నిలిపివేశారన్నారు. గాడిమొగ మహిళా సర్పంచ్ తనను ఎదిరించి ఎన్నికల్లో నిలబడి గెలిచిందని కక్షతో ఓడిపోయిన వ్యక్తిని వార్డుమెంబరు చేసి ఉపసర్పంచ్ పదవిని కట్టబెట్టి గాడిమొగలో ఏ అబివృద్ధి లేకుండా చేశారని ఆరోపించారు. మాపై 13 అక్రమ కేసులు పెట్టించి చాలా ఇబ్బ ందులు పెట్టడంతోనే వైసీపీలో ఇమడలేక టీడీపీలో చేరామని వారు తెలిపారు. ఎమ్మెల్యే అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సమావేశంలో అగ్నికుల క్షత్రియులు కామాడి చినమాతరాజు, కొప్పాడి పెదధర్మారా వు, సంగాడి కామేశ్వరరావు, లంకే వీరబాబు, పెసింగి ఈశ్వరరావు, చింతా వీర్రాజు, కొక్కిలగడ్డ రాము, పెసింగి నాగరాజు, కొక్కిలిగడ్డ బాబూరావు, మల్లాడి సీతారామరాజు ఉన్నారు.