Share News

మధుమేహం ఉన్నా..‘మధురంగా’

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:04 AM

తీపి అంటే ఎవరికి చేదు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరికైనాసరే స్వీట్‌ అంటే ఇష్ట మే. ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజల జీవన శైలిలో తీపి ఓ భాగం. శుభకార్యక్రమం గురించి చెప్పేటప్పుడు, అభినందించేటప్పుడ నోటిని తీపి దనం చేస్తారు.

మధుమేహం ఉన్నా..‘మధురంగా’

మార్కెట్‌లో ఆకర్షిస్తున్న డయాబెటిక్‌ స్వీట్స్‌

అందులో పంచదార కంటే.. తక్కువ చక్కెరనిచ్చే పదార్థాలు

ఇవి ఆలస్యంగా అరగడం వల్ల తక్కువ షుగర్‌లెవెల్స్‌

( రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

తీపి అంటే ఎవరికి చేదు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరికైనాసరే స్వీట్‌ అంటే ఇష్ట మే. ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజల జీవన శైలిలో తీపి ఓ భాగం. శుభకార్యక్రమం గురించి చెప్పేటప్పుడు, అభినందించేటప్పుడ నోటిని తీపి దనం చేస్తారు. బంధువులు, మిత్రుల ఇళ్లకు వెళ్లే టప్పుడు కూడా చాలామంది స్వీట్స్‌ తీసుకుని వెళ్తారు. ఫంక్షన్ల భోజనాల్లో స్వీట్లు లేకుండా వడ్డన ఉండదు. పండుగలకు స్వీట్‌ తప్పనిస రిగా ఉంటుంది. చివరకు పరామర్శలకు వెళ్లేట ప్పుడూ పంచదారో, స్వీటో వంటి తీపి పదార్థాల ను తీసుకువెళ్తారు. అంటే షడ్‌రుచుల్లో తీపి ఒకటి. ప్రధానమైనది కూడా. కానీ మధుమేహ (చక్కెర... డయాబెటీస్‌) వ్యాధితో బాధపడుతు న్న వారికి స్వీట్‌ ఓ ప్రమాదకర పదార్థమైపో యింది. స్వీట్‌ తినడంవల్ల షుగర్‌ లెవల్స్‌ పెరిగి ప్రాణాంతక పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వైద్యులు కూడా స్వీట్లు తినవద్దని హెచ్చరిస్తా రు. పంచదార ఉండే ఏ పదార్థాలు, దుంపలు వంటి కూరలు కూడా కట్టడి చేస్తారు. కానీ రుచికి అలవాటు పడిన నాలుకను ఆపడం కష్ట మే. స్వీట్‌ తినే అదృష్టం కూడా లేదని గతంలో వారంతా తెగ బాధపడిపోయేవారు. ఒక్కొక్కరు ఉండలేక ఓ స్వీట్‌ తినేయడం.. టాబ్లెట్‌ వేసుకోవ డం కూడా చేస్తున్నారు. కానీ కొంతకాలంగా డయాబెటీస్‌ బాధితుల నోటిని తీపిచేస్తూ వారికి షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా చేస్తూ ఉండే స్వీట్లు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. దీంతో చాలా మంది మనస్సు కుదుటపడింది. మార్కెట్‌లో డ యాబెటీస్‌ స్వీట్లు పేరిట షుగర్‌ఫ్రీ స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు కూడా మార్కెట్‌లో ఉన్నాయి. స్వీట్లలో డయాబెటిక్‌ కాజా, సున్నుండలు, కోవా, కాజూబర్ఫీ, మోతీచూర్‌ లడ్డూ వంటివి అందు బాటులో ఉన్నాయి. కానీ ఇవి పూర్తిగా స్వీట్‌లెస్‌ స్వీట్లు కావు. ఈ పదార్థాల్లో పంచదారశాతం తక్కువ. ఆలస్యంగా అరుగుతాయి. అందువల్ల తిన్న వెంటనే ప్రభావం చూపవు. ఆలస్యంగా కొద్ది ప్రభావం మాత్రమే చూపుతాయి.

ఇవి ఎలా తయారు చేస్తారంటే..

ఈ స్వీట్లలో పంచదార వినియోగించరు. మా ర్కెట్‌లో లభ్యమయ్యే టాటాఫోసెన్స్‌, స్వీట్‌ మేక ర్‌, హాఫ్‌ షుగర్‌ వంటి మార్కెట్‌లో రెడీమేడ్‌గా దొరికే పదార్థాలతో తయారుచేస్తారు. ఇది కొంత వరకూ డయాబెటిక్‌ బాధితుల నోటిని తీపి చేసు కోవచ్చు. టాటాఫోసెన్స్‌ లిక్విడ్‌ రూపంలో ఉం టుంది. దీంతో గులాబ్‌జామ్‌, కాజాలు వంటివి తయారు చేస్తారు. పంచదారలో 100శాతం పం చదార ఉంటే, బియ్యంలో 70శాతం వరకే ఉం టుంది. టాటాఫోసెన్స్‌లో 18శాతం మాత్రమే ఉంటుంది. అందువల్లే దీంతో తయారు చేసే స్వీట్లకు మార్కెట్‌ పెరిగింది.

ప్రత్యామ్నాయం.. డైట్‌ షుగర్‌

మార్కెట్‌లో పంచదారకు ప్రత్యామ్నాయంగా డైట్‌ షుగర్‌ వచ్చింది. ఇది పంచదారలాగే ఉం టుంది. గరుకుతనం కాస్త తక్కువ. స్వీట్‌నెస్‌ ఎక్కువ. దీంతో కోవా, క్యాజూబర్ఫీ వంటివి త యారు చేసుకోవచ్చు. కాఫీ, టీలలో వాడొచ్చు. మార్కెట్‌లో రెలిష్‌, నేచురా, గ్రీన్‌, షుగర్‌ లైట్‌ వంటి పేర్లతో వీటిని విక్రయిస్తున్నారు.

ఆఫ్‌ షుగర్‌

ఇది కూడా పంచదారలాగే ఉంటుంది. పం చదారలో ఉండే కాలరీస్‌లో సగమే ఉంటాయి. పంచదారలాగే తియ్యగా ఉంటుంది.

జలాటో

జలాటో అనేది ఐస్‌క్రీమ్‌లా ఉంటుంది. దీన్ని ఇటాలియం డిజట్‌ అంటారు. కానీ ఇది ఐస్‌క్రీమ్‌లా గట్టిపడదు. స్పూన్‌తోనే తినవచ్చు.

Updated Date - Oct 25 , 2024 | 06:36 AM